ప్రతి మండలం లో ఇంటి నిర్మా ణాలు వేగం చెయ్యడం తో పాటు స్టేజ్ కన్వర్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

 


కొవ్వూరు, (ప్రజా అమరావతి);


నవరత్నాలు పేద లందరికీ ఇళ్లు నిర్మాణంలో  కొవ్వూరు డివిజన్, కొవ్వూరు, నిడదవోలు  మున్సిపాలిటీ లలో  స్టేజ్ కన్వర్షన్ కోసం లక్ష్యం నిర్దేశించగా కేవలం 30 నుంచి 35 శాతం మాత్రమే సాధించడం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ వివరణ కోరారు.


సోమవారం కొవ్వూరు పురపాలక సంఘం కార్యా లయంసమావేశ మందిరం నుంచి కొవ్వూరు డివిజన్ మునిసిపల్,మండల స్థాయి అధికారులతో హౌసింగ్ పై జాయింట్ కలెక్టర్, ఇంఛార్జి డి ఆర్ ఓ మల్లిబాబు తో కలిసి సమీక్ష నిర్వ హించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  ప్రతి మండలం లో ఇంటి నిర్మా ణాలు వేగం చెయ్యడం తో పాటు స్టేజ్ కన్వర్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల


న్నారు. స్టేజ్ కన్వర్షన్ పై నిబద్దత చూపకపోతే  రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి సగటు కు చేరడం సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.  ఇకపై వ్యక్తిగతంగా  ప్రతి రోజూ మండల అధికారులతో సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన ముడి సరుకు అందుబాటు లో ఉంచడం, డ్వాక్రా మహిళలకు 50 వేలు వరకు ఋణా సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో కొన్ని మండలాలు ఇంటి పనులు పూర్తి చెయ్యడం తో పాటు, దశల వారీగా ప్రగతి కోసం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.



జిల్లా ఇంఛార్జి డిఆర్వో, కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, హౌసింగ్ జిల్లా అధికారి టి. తారా చంద్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.



Comments