శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమల వెంకటేశుని ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఉండాలని కోరుకున్నా: రాజన్న దొర

 

*శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమల వెంకటేశుని ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఉండాలని కోరుకున్నా: రాజన్న దొర*



తిరుపతి, సెప్టెంబర్17 (ప్రజా అమరావతి): శ్రీ పద్మావతి అమ్మవారు, తిరుమల శ్రీ వెంకటేశుని ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఉండాలని కోరుకున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) రాజన్న దొర ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.


ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సతీ సమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సంబంధిత అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన అనంతరం తీర్థ  ప్రసాదములు అందచేసి అర్చకులు ఆశీర్వచనం పలికారు.


దర్శనం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకు నగదు జమ చేయడం ద్వారా పారదర్శకమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. తిరుమల వెంకటేశుని, శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, రాష్ట్ర ప్రజలపై, తిరుపతి జిల్లా ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్టశక్తుల నుండి, ఆపత్కాల విపత్తుల నుండి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. 


 ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి చెన్నయ్య, ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ రాణి మంద, తిరుపతి రూరల్ తాసిల్దారు లోకేశ్వరి, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments