*ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డితో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సమావేశం
*
*రాయదుర్గం నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధిపై చర్చ*
అమరావతి, సెప్టెంబర్, 28 (ప్రజా అమరావతి); ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డితో ప్రభుత్వ విప్ , రాయదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు సమావేశమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతిపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గుర్తించిన 15 వేల ఎకరాల భూమి లో 2 వేల మెగవాట్ల సోలార్ ప్రాజెక్టు, డి. హిరేహాల్ మండలం సమీపంలో ఉక్కు సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఏపీఐఐసీ మంగళగిరి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment