ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


వినాయక నిమజ్జనం విషయం లో నిబంధనలు పాటించాలి 


ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి 




కమిషనర్ కె.దినేష్ కుమార్ విజ్ఞప్తి 


నగరలో వినాయక నిమజ్జనాలు ప్రారంభమైన సందర్భంలో నగరపాలక సంస్థ 

ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను పాటించి సహకరించాలని కమిషనర్  కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.



 పెద్ద విగ్రహాలను ఇసుక ర్యాంపు లలో మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు. చిన్న విగ్రహాలను, మూడు అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన అన్నారు వాటికి ఘాట్ ల వద్ద ఏర్పాటుచేసిన కలెక్షన్ పాయింట్ల లో అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ నదిలోకి దిగరాదని కోరారు.


 నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నిమజ్జనం సందర్భం గా ఊరేగింపు  సమయంలో నగర ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని , ట్రాఫిక్ కి ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు .అధిక సంఖ్యలో నిమజ్జన ఊరేగింపునకు అనుమతి లేదని పేర్కొన్నారు.  తక్కువ మంది తో మాత్రమే ఊరేగింపు నిర్వహించుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




Comments