విజయవాడ, (ప్రజా అమరావతి);
దసరా నవరాత్రులు రెండవ రోజు మంగళవారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 37 లక్షల 15 వేల 675 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ శ్రీమతి డి. భ్రమరాంబ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దసరా శరన్నవరాత్రులు రెండవ రోజు మంగళవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 8 లక్షల 53 వేల 500 రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 9 లక్షల 99 వేల 900 రూపాయలు, రూ. 100 టిక్కెట్స్ అమ్మకం ద్వారా రూ. 5 లక్షల 22 వేల 800 రూపాయలు ఆర్జించడం జరిగిందని, అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 8 లక్షల 95 వేల 980 రూపాయలు, కుంకుమార్చన టిక్కెట్స్ ద్వారా రూ. 94 వేలు, చండీ హోమం టిక్కెట్స్ రూ. 60 వేల రూపాయలు, ఇతర సేవలు ద్వారా రూ. 2 లక్షల 89 వేల 495 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆ ప్రకటనలో ఈ ఓ తెలిపారు.
addComments
Post a Comment