పెడన,
12 సెప్టెంబర్ (ప్రజా అమరావతి);
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షపాతి సీఎం జగన్
మంత్రి శ్రీ జోగి రమేష్.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మరియు భవన కార్మిక కుటుంబాల ఆడపిల్లల వివాహం గౌరవప్రదంగా జరిపించేందుకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా పథకాన్ని అమలు చేయనున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఈరోజు పెడన పట్టణ కార్యాలయంలో పాలాభిషేకం జరిపారు.
పెడన పట్టణానికి చెందిన పలువురు మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ జోగి రమేష్ గారు మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద మైనార్టీలకు షాదీ తోఫా కింద 50 వేల రూపాయలు అందిస్తే ఈరోజు మనసున్న, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి ఆ సొమ్మును రెట్టింపు చేసి లక్ష రూపాయలు అందించడం ఎంతో ముదావహం అన్నారు.
అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కారు ఉన్న వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా పథకాలలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98.44 శాతంఅమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ప్రస్తుతించారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మంత్రి శ్రీ జోగి రమేష్ గారిని ఆశీర్వదించి వారికి ఆశీస్సులు అందజేయగా, జిల్లా మైనారిటీ కన్వీనర్ ఆయూబ్ ఖాన్ గారు వారి సంప్రదాయ సిద్ధమైన శాలువాతో మంత్రి గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం జగన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ కాజా, కౌన్సిలర్లు బాబూలాల్,రాహేతున్నిస, బల్ల గంగయ్య, కటకం ప్రసాద్, మెట్ల గోపి,కోమట్ల అనిల్, గరికిముక్కు చంద్రబాబు,కో ఆప్షన్ సభ్యుడు మున్నా, షాదీఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్ భాషీద్,మతీన్ ఖాన్,మీర్ బాబు, అక్తరున్నిసా, ఇమ్రాన్, హుమాయాన్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
addComments
Post a Comment