అమరావతి (ప్రజా అమరావతి);
*-లోన్ యాప్ వేధింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి వనిత...*
*-రాజమండ్రి దంపతుల ఆత్మహత్య కు కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హోం మినిస్టర్...*
*-తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత...*
*-ఈ ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి...*
*-రాజమండ్రి ఘటనలో యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేకంగా మూడు బృందాల గాలింపు...*
*-ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన లోన్ యాప్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హోంమంత్రి...*
*-ఆర్ బి ఐ అనుమతులు లేని లోన్ యాప్ లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించిన హోంమంత్రి...*
*-ఆన్ లైన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన హోం మినిస్టర్ వనిత...*
*-రాజమండ్రి లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా నిలబడిన సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హోంమంత్రి...*
రాష్ట్రంలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హోం శాఖ మాత్యులు తానేటి వనిత గారు ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న హోంమంత్రి తానేటి వనిత గారు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆన్ లోన్ యాప్ లకు సంబంధించిన సమాచారాన్ని, యాప్ నిర్వాహకుల వేధింపులపై నమోదైన కేసుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి పోలీసులకు సూచించారు. రిజర్వ్ బ్యాంకు అనుమతులు లేని లోన్ యాప్ లను గుర్తించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇతర దేశాలు, వివిధ రాష్ట్రాల నుండి ఆన్ లైన్ లో లోన్ యాప్ నిర్వహిస్తున్న గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా అనుమతులు లేని యాప్ లను గుర్తించి..సంబంధిత అధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్ ల పేరుతో వేధింపులకు గురిచేస్తూ..ప్రజల ప్రాణాలతో చేలాగటం ఆడుతున్న నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని హోంమంత్రి తానేటి వనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
రాజమండ్రి లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి కుటుంబసభ్యులకు హోం మినిస్టర్ వనిత గారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరిని వేధింపులకు గురిచేసిన లోన్ యాప్ నిర్వహకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లను హోంమంత్రి వనిత గారు ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన లోన్ యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను పంపించినట్లు హోంమంత్రి కి వివరించారు. రాజమండ్రి దంపతుల ఆత్మహత్య కు కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల మాయ లో పడి మోసపోకండి అని ప్రజలకు హోంమంత్రి సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో చనిపోయిన దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి పిల్లలకు ఆర్థిక సహాయం చేసినందుకు హోంమంత్రి తానేటి వనిత గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
addComments
Post a Comment