నెల్లూరు, సెప్టెంబర్ 3 (ప్రజా అమరావతి): చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంకితభావంతో అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను నిర్వర్తించాల
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ ఉద్యోగాలు పొందిన కార్యకర్తలు శనివారం ఉదయం నెల్లూరు పొదలకూరు రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులందరూ చిన్నారుల పట్ల ప్రేమగా మెలిగి, వారిని తమ బిడ్డలవలె భావించి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు సిడిపివోలు అన్నపూర్ణ, హెనా సుజన్, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment