మొత్తం బడుగు బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం కుప్పం

 చిత్తూరు జిల్లా (చిత్తూరు/కుప్పం) (ప్రజా అమరావతి);


_*చిత్తూరు జైలులో రిమాండ్ లో ఉన్న కుప్పం నేతలకు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు పరామర్శ*_


*గత నెల పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా 72 మందిపై కేసులు పెట్టిన పోలీసులు*


*- మొత్తం 6 ఎఫ్ఐఆర్ ల నమోదు, ఇప్పటికి 8 మందికి రిమాండ్.*


*- మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు, కుప్పం అర్బన్ పార్టీ ప్రసిడెంట్ ఎస్.రాజ్ కుమార్, రామకుప్పం మాజీ జడ్పిటిసి టి.మునుస్వామి, కార్య నిర్వాహక కార్యదర్శి, జిల్లా వాణిజ్య విభాగం, మంజునాథ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి, శాంతిపురం మండలం, ఆర్.ఎస్. మణి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునియప్ప, కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు,నఎం. సుబ్రహ్మణ్యం (సుబ్బు),  ముఖేష్, బూత్ కన్వీనర్, కొత్త పేట, కుప్పం మునిసిపాలిటీ నేతలకు చంద్రబాబు పరామర్శ*


_*పరామర్శ అనంతరం జైలు వద్ద టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ..*_


★ కుప్పంలో కార్యకర్తలకు అన్యాయం జరిగితే తమకే జరిగిందని భావించి అంతా జైలు వద్దకు తరలి వచ్చారు.


★ కార్యకర్తలకు అండగా ఉంటాము అనే భావనతో వచ్చారు.


★ సుదీర్ఘ అనుభవం కలిగిన నేను మొదటి సారి జైలుకు వచ్చాను. కార్యకర్తల పరామర్శ కోసం జైలుకు వచ్చాను.


ఇప్పుడు జైల్లో ఉన్న వారు తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం వీళ్లు జైలుకు వెళ్లారు.


కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా నన్ను ముద్దుబిడ్డగా గెలిపిస్తూ వచ్చారు. శాంతికి, మంచికి మారుపేరు కుప్పం


★ మొత్తం బడుగు బలహీన వర్గాలు ఉండే నియోజకవర్గం కుప్పం



★ నా పర్యటన ఉంటే ముందుగా ఉన్నతాధికారులు రూట్ చెక్ చెయ్యాలి. శాంతి భద్రతలపై పర్యవేక్షణ చెయ్యాలి.


★ బందిపోట్లు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉంటే నేను రాష్ట్రంలో తిరగకూడదు అనేది వీళ్ల అభిప్రాయం


★ ఈ జిల్లాలో అయినా... రాష్ట్రంలో అయినా...ఏ అభివృద్ది జరిగినా టిడిపి హయాంలోనే జరిగింది.


★ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షం ఉన్న పార్టీ టిడిపి


★ నా పర్యటనలో కావాలని వైసిపి దొంగలు, రౌడీలు వచ్చారు. వస్తే పోలీసులు వారిని బయటకు పంపాలి. కానీ పంపలేదు.


★ జగన్ రెడ్డీ నీకు వార్నింగ్ ఇస్తున్నా....రాష్ట్రం మొత్తం నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. 


★ నువ్వు రౌడీవి అయితే... నేను రౌడీల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిని నేను.


 ★ కొల్లుపల్లిలో ఘర్షణపై ప్రశ్నిస్తే తిరిగి మన కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేశారు.


★ అందరు పోలీసులు తప్పుడు పోలీసులు కాదు....కొందరు అక్రమ పోలీసు అధికారులు ఉన్నారు. 


★ అందరి లెక్కలు నేను రాసిపెడుతున్నాను. తప్పు చేసిన ఏ పోలీసులను వదిలేది లేదు.


★ 1985లో నందమూరి తారాక రామారావును పదవినుంచి తొలగిస్తే పోరాడి గెలిచింది టిడిపి, తెలుగు ప్రజలు. అది మన చరిత్ర.


★ ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం...మీ కేసులకు మేం భయపడం


★ స్వాతంత్ర్యం కోసం నాడు గాంధీజీ చేసిన పోరాటం లాంటిదే నేడు మనం చేస్తున్నాం.


★ నాడు బ్రిటీష్ వారిపై ప్రజలు పోరాడారు.... అదే తరహాలో నేడు ఉన్మాది జగన్ రెడ్డిపై పోరాడుతున్నాం.


★ అరెస్టు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. మీరు చంపడానికి వచ్చి తిరిగి వారిపైనే కేసులు పెడతారా?


★ సెక్షన్ 324, 353, 143, 147, 148, 427, 436,506 ల కింద సెక్షన్ లు పెట్టారు. 


★ ఏం నేరం చేశారని ఈ సెక్షన్ లు పెట్టి అరెస్టు చేశారు.


★ మా అస్థులు తగలబెట్టి మాపై తిరిగి కేసులు పెట్టారు.


★ ఎస్సీలపై కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది.


★ 6 ఎఫ్ ఐఆర్ లు వేసి 8 మందిని అరెస్టు చేశారు... మొత్తం 72 మందిపై కేసులు పెట్టారు.


★ ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని పెట్టి పేర్లు చేర్చుతూ వెళుతున్నారు.


★ ప్రజలు కూడా ఆలోచించాలి.... ప్రజల సమస్యలపై పోరాడుతుంటే కూడా కేసులు పెడుతున్నారు. 


★ జగన్ కేసులకు, పులివెందల బాంబులకు భయపడేవారు ఎవరూ లేరు.


 బాబాయ్ ని చంపి.... నారాసుర రక్త చరిత్ర అన్నావ్.సిగ్గుండాలి.


 జగన్ సోదరి సుప్రీం కోర్టుకు వెళ్లి వేరే రాష్ట్రానికి కేసును బదిలీ చెయ్యమని అడిగింది.


 సిబిఐ ని కూడా బెదిరించే గొప్ప నాయకుడు సిఎం జగన్


 ఇప్పుడు నీ  దగ్గర ఉన్న పోలీసులే నిన్ను అరెస్టు చేసే రోజు వస్తుంది


మావోయిస్టుల క్లైమోర్ మైన్స్ కే భయపడని నేను....నీకు భయపడతానా


 నీ మీటింగ్ కోసం వచ్చిన వారిని ఇలా జైల్లో చూస్తే చాలా బాధేస్తుంది.


 69 ఏళ్ల వయసులో, నిజాయితీ పరుడు అయిన గౌనివాని శ్రీనివాసులపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు.


 72 మందిపై కేసులు పెట్టి....అంతా జైల్లో బాధపడుతుంటే పైశాచిక ఆనందం కోసం జగన్ కుప్పం వస్తున్నాడు.


 నేను పులివెందులకు నీళ్లు ఇచ్చాను. 


 ఏం చేశాడని జగన్ కుప్పం వస్తున్నాడు.....ఎందుకు కుప్పానికి మూడేళ్లు అయినా హంద్రీనీవా నీళ్లు తేలేదు.


 అందరినీ జైల్లో పెట్టి ఆనందం పంచుకోవడానికి జగన్ కుప్పం వస్తున్నాడు


 175 సీట్లలో జగన్ గెలివడం కాదు....ముందు పులివెందుల గెలిచి చూపించు.


 ఏమని పులివెందులలో ఓట్లు అడుగుతావు.... బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతావా


 ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్దాలు చెపుతున్నారు... రైతులు, పోలవరం, అమరావతి తో సహా అన్ని అంశాలపై అబద్దాలు చెపుతున్నాడు.


 రాష్ట్రంలో కనీసం ఇసుక దొరికే పరిస్థితి లేదు...పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది.


 మధ్యనిషేదం అని నాసిరకం మద్యం అమ్ముతున్నారు.


 రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది. అందరినీ బోను ఎక్కిస్తాం.


 కొందరు పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారు.


 కుప్పంలో పోలీసులు మఫ్టీలో వచ్చి టిడిపి కార్యకర్తలపై దాడి చేశారు. 


 ఇవన్నీ లెక్కిస్తున్నా.....చట్ట వ్యతిరేకంగా పని చేసిన వారి లెక్కలు తేల్చుతా.


 కుప్పం నుంచి ధర్మ పోరాటం ప్రారంభం అయ్యింది. 


 ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను అండగా ఉంటాను.


కుప్పంలో సిఎం వస్తున్నారని నోటీసులు ఇచ్చి బైండోవర్ కేసులు పెడుతున్నారు.


 కుప్పం ప్రజలు కుప్పం నుంచి నగిరికి వెళ్లి రిపోర్ట్ చెయ్యాలని నోటీసులు ఇస్తున్నారు


 పోలీసులు బ్రిటీష్ వారికంటే నీచంగా వ్యవహరిస్తున్నారు.


 అనవసరంగా కేసులు పెడితే ఎంత మానసిక క్షోభ ఉంటుందో పోలీసులు తెలుసుకోవాలి.


 పెళ్లి కుదిరిన సుబ్రహ్మణ్యంపై కేసు పెట్టారు....ఇప్పుడు కేసు కారణంగా పెళ్లి రద్దు అయ్యే అవకాశం ఉంది.


 మరో వ్యక్తి భార్య డెలివరీ ఉంది...అతన్ని కూడా జైల్లో పెట్టారు.


 జగన్ నువ్వు ఒక మనిషివా....పసువుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు.


 నాపై కేసులు పెట్టాలని సిఎం ఫైళ్లు వెతుకుతూనే ఉన్నాడు...కొండన తవ్విన జగన్ కు వెంట్రుక కూడా దొరకలేదు.


 కుప్పంలో అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని ఏమని అడగాలి.


 పేదవాడి పొట్టకొట్టే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి, పేదవాడికి తిండిపెడితే నచ్చదు.


 మూడు రాజధానులు.... మూడు ముక్కలాట.


 రాష్ట్రానికి రాజధాని ఏంది అంటే....మూడు ముక్కలు అని చెప్పాలి.


 సిఎం జగన్ మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు.


 వీటికి ఒకటే సమాధానం.... ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.


 మన రాజధాని అమరావతి అంటూ ప్రజలతో కలిసి చంద్రబాబు నినాదాలు


 రాజధాని విషయంలో జగన్ మాట తప్పాడు...కానీ  అమరావతి పై ప్రజలు మాట తప్పరు.


 ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టి తీసుకువెళ్లి, ప్రజల అందరి ఆమోదంతో అమరావతి కట్టాము.


 ఒక్క వివాదం లేకుండా భూములు ఇచ్చిన రాజధాని రైతులది సంస్కారం....జగన్ ది అహంకారం.


 టిడిపి సంపద సృష్టించే పార్టీ....జగన్ సంపదను ధ్వంసం చేసే వ్యక్తి.


 జగన్ చేసేది అన్యాయం అని చెపుతున్నాం కాబట్టి మనపై కేసులు పెడతున్నాడు.


 అందుకే క్విట్ జగన్...సేవ్ ఆంధ్ర ప్రదేశ్.


 ప్రజా స్వాయ్యంలో ఇలాంటి నేతలు ఉండకూడదు.

Comments