అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్



ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);


అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్



శుక్రవారం రాత్రి తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంధ్రకేలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా  ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని,  ఆలయ ఈవో డి.భ్రమరాంబ, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ లకు కృతజ్ఞతలు తెలిపారు.


Comments