కడియం (ప్రజా అమరావతి);
** రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ స్వరాజ్య పాలనకు అభివృద్ది అంశాలకు నిదర్శనం జేగురుపాడు..
..మండలి చైర్మన్ మోషేన్ రాజు
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ గ్రామస్వరాజ్యానికి ప్రత్యక్ష నిదర్శనం జేగురుపాడు గ్రామ పంచాయితీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు.
బుధవారం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో రైతుభరోసాకేంద్రం, వైస్సార్ చిల్డ్రన్ పార్కు, సీనియర్ సిటిజన్ సెల్టర్, పాఠశాలలో భోజనశాల, గ్రామ సచివాలయభవనాలను రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ తదితరులతో కలసి మండలి చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో గల జేగురుపాడు గ్రామం రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ సంక్షేమ అభివృద్ది పాలనకు నిదర్శనంగా రైతుభరోసా కేంద్రం, సచివాలయం, మనబడి నాడు-నేడు, పార్కులు పలు అభివృద్ది పనులు జరగడానికి ముఖ్యమంత్రి మంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు.
2007 సం.రంలోనే ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధి చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కారం జేగురుపాడు పంచాయితీ అవార్డు అందుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా స్టాలిన్ దంపతులు చేపట్టిన గ్రామంలోని పలు అభివృద్ది ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. అభివృద్దికి ప్రజలు పట్టంకడతారనడానికి షెడ్యూల్ కులానికి చెందిన స్టాలిన్ జనరల్ కేటగిరిలో ఎన్నిక కావడం ఇక్కడ ప్రజల విజ్ఞతను చాటుతుందన్నారు. వెనుకబడిన తరగతుల వారికి అవకాశం ఇస్తే వారి పనితనాన్ని నిరూపించుకుంటారనడానికి ఎంపి మార్గాని భరత్ రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, సర్పంచ్ స్టాలిన్ వంటి వారు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చైర్మన్ మోషేన్ రాజు అభిలాష వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చేంద్రబోస్ మాట్లాడుతూ గ్రామ పరిపాలనా వ్యవస్థకు ప్రత్యక్ష నిదర్శనం నేడు జరుగుతున్న ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు అద్దం పడుతున్నాయన్నారు. రైతులకు గత మూడేళ్ళకాలంలో లక్షా 27 వేలకోట్ల ఆర్థిక ప్రయోజనాలను కల్పించారన్నారు. దేశంలోనే రైతులకు త పెద్ద మొత్తంలో చేయూతనందించిన ముఖ్యమంత్రి మరొకరు లేన్నారు. అదేవిధంగా పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా కరోనా వంటి విపత్తు సమయంలో కూడా పేదలకు ఆర్థిక చేయూతను అందించడం పలువురు విమర్శలు చేశారన్నారు. అయితే ఆనాడు అందించిన చేయూత ద్వారానే నేడు భారత దేశంలోనే రాష్ట్రంలో ప్రజల ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని స్వయంగా ప్రదానమంత్రి నరేంద్రమోదీ వాక్యానించడం జరిగిందన్నారు. అమ్మఒడి, మనబడి నాడు-నేడు వంటి కార్యక్రమాలు ద్వారా విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు.
యంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ గాంధిజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రత్యక్ష నిదర్శమైన జేగురుపాడు మన పార్లమెంట్ పరిధిలో ఉండడం, స్టాలిన్ వంటి సమర్థవంతమైన సర్పంచ్ పర్యవేక్షణలో జిల్లాకే ఆదర్శవంతగా నిలవడం గర్వకారణ మన్నారు. జేగురుపాడు గ్రామ పంచాయితీ అభివృద్ది తన వంతు కృషి చేస్తానన్నారు. ఈసందర్బంగా స్టాలిన్ దంపతులను మండలి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సర్పంచ్ స్టాలిన్ దంపతులు, యంపీపీ వెలుగుబండి వెంకట సత్యప్రసాద్, యంపిటీసీలు, ఆకుల సుధాకర్, నాగిరెడ్డిసూర్యరామకృష్ణ, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, డీపీవో పి. జగదాంబ, ఎస్ ఈ పిఆర్ ఏబీవి ప్రసాద్, డ్వామా పీడీ జి.ఎస్.రామగోపాల్, యంపీడీవో కె. రత్నకుమారి పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment