రామచంద్రాపురం
సెప్టెంబర్ 25 (ప్రజా అమరావతి);
రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛ, స్వచ్ఛ, సేవ, స్నేహ భావంతో పనిచేసి మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆదర్శవంతులు గా కీర్తి గడించాలని సమాచార పౌర సంబంధాలు,బిసి సంక్షేమం , సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ తెలిపారు .
ఆదివారం రామచంద్రపురం ఎం వి ఆర్ కళ్యాణ మండపంలో గ్రామ స్వరాజ్యం జగనన్నకే సాధ్యం పేరిట ఒక సంవత్సరం పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్ బెర్లిన్, జర్మనీ అధ్యక్షులు డాక్టర్. క్రిస్టియన్ బర్తోల్ఫ్, అకాడమీ ఆఫ్ గాంధియన్ థాట్స్ సర్వోదయ ప్రసాద్ ల తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవే పరమావధిగా పని చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మహాత్మాగాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉన్నతమైన ఆశయాలతో పని చేస్తే వాటి ఫలితాలు ప్రజా రంజకంగా ఉంటాయన్నారు. రాజకీయాల్లో నిజాలు మాట్లాడే వారే శాశ్వతంగా నిలుస్తారని, మహాత్మా గాంధీ ఆశయాలను సాకారం చేయడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతమయ్యారు. 1948 మహాత్మాగాంధీ మరణానికి ముందు ఏమి ఆశించారో నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేస్తున్నారన్నారు. రాజకీయ స్వావలంబన తో పాటు స్వేచ్ఛ, సామాజిక, ఆర్ధిక ఫలాలు ప్రతి ఒక్కరికి దక్కే విధంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ స్వరాజ్యం కొరకు ఏడు లక్ష లమంది లోక్ సేవక్ లను ఆశించారు అన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రుల కోసం రెండు లక్ష ల 86 వేల మంది వాలంటీర్ల నియామకం చేసి గాంధీజీ కలలను సాకారం చేసి తన నిజా
యితీని నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి పనితీరు పట్ల మంత్రి ప్రశంసించారు.
గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్ బెర్లిన్, జర్మనీ అధ్యక్షులు డాక్టర్. క్రిస్టియన్ బర్తోల్ఫ్ మాట్లాడుతూ తన ప్రత్యర్థులచే కీర్తింపబడిన మహానేత మహాత్మాగాంధీ గా అభివర్ణించారు.
23 సంవత్సరాల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత పై ప్రశ్నించినందుకు గాను జైలు పాలు అయ్యారన్నారు. శిక్ష కాలములో మహాత్మాగాంధీ చెప్పులు కుట్టడం నేర్చుకున్నారని, తాను కుట్టిన చెప్పులను ఆనాటి దక్షిణ ఆఫ్రికా పాలకులకు కానుకగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంఘటన ఆనాడే దక్షిణాఫ్రికాలో కలకలం సృష్టించింది అన్నారు. ప్రపంచంలో పౌరులందరూ సమానులే నని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని, భేదభావాలు ఉండకూడదనే సిద్ధాంతంతో మహాత్మా గాంధీ పని చేశారన్నారు. వారి ఆశయాలను ప్రభావితమై వివిధ దేశాల్లో గాంధీజి సిద్ధాంతాలను వివరించేందుకు పర్యటనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్వరాజ్యం కొరకు పాటు పడిన మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా స్థానిక ప్రజా ప్రతినిధులు వారి ఆశయ సాధనకు సాధించే విధముగా పనిచేయాలని హితవు పలికారు .
అకాడమీ ఆఫ్ గాంధీయన్ థాట్స్ ప్రతినిధి సర్వోదయ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు నిధులు లేకుండా చేసే అభివృద్ధి పనుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యముగా చదువులను ప్రోత్సహించడం, మద్యపాన నిషేధం వ్యవసాయం పట్ల సాంప్రదాయం విధానాలు పాటించడం లాంటి అంశాలు చేపట్టటం ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు . ఇవి సాధ్యం అయిన రోజున నిదులు వాటికవే వస్తాయని మహారాష్ట్రలో జరిగిన సంఘటనలను సర్వోదయ ప్రసాద్ ప్రజా ప్రతినిధులకు వివరించారు.
addComments
Post a Comment