కె.గంగవరం (ప్రజా అమరావతి);
పానింగపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్య ను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
శనివారం రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం పానింగపల్లి గ్రామంలో బిసి, ఎస్ సి పేటల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని వీటికి సంబందిత ఇంజనీరింగ్ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయాల
ని ఆదేశించారు. మంచినీటి గురుంచి అడుగుతున్నారని,జలజీన్ మిషన్ పథకం ద్వారా ప్రతీ ఇంటికీ కుళాయి అందించే కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు.
అదేవిధంగా గ్రామంలో స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు గృహ నిర్మాణ సంస్థ చే తగిన ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో చక్కటి పారిశుద్ధ్యo వుండే విధంగా గ్రామ ప్రవేశాల్లో డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి దీనిని రీసైక్లింగ్ చేసి ప్రత్యామ్నాయ పద్దతుల్లో వినియోగించే విధంగా పంచాయతీ యంత్రాంగం చేయవలసి ఉందన్నారు. వీటి ఏర్పాటు కు సంభందించిన నిధులు జిల్లా పంచాయతీ నుండి విడుదల ఆవుతాయన్నారు. రామచంద్రపురాన్ని స్వేచ్ఛ, స్వచ్చ రామచంద్రపురం గా తీర్చిదిద్దుతున్నమని అదే తరహాలో నియోజకవర్గం లోని గ్రామాలను చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఏ ఇంటి కి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన భోరసా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తంచేస్తున్నారని అన్నారు. అన్నీ వర్గాల వారికి లభ్ది చేకూరే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ దిశగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సాధ్యమైందన్నారు. ఎన్నో పరిపాలన వ్యవస్థ లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ని సచివాలయాల వ్యవస్థ చక్కగాపనిచేస్తున్నాయని అన్నారు. ఈ వ్యవస్థల పనితీరు తోనే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో చక్కటి ఆదరణ, హారతులు దక్కుతున్నాయన్నారు..
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అవినీతి లేని పాలనే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఆరోగ్యశ్రీ, తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె గంగవరం మండలం ఎంపీపీ నీతిపూడి మదుబాల, ఎంపీడీఓ జి. శ్రీనివాస్, సర్పంచ్ చికట్ల సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment