అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి.
అమరావతి:16 సెప్టెంబరు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా శుక్రవారం అసెంబ్లీలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వద్ద కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు మరియు బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు,మాజీమంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పి.పుష్పశ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కోలగట్ల వీరభద్ర స్వామి శాసన సభాపతి తమ్మినేని సీతారాంను కలిశారు.
addComments
Post a Comment