పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: రాజన్న దొర*రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం*


*పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: రాజన్న దొర


*


తిరుపతి, సెప్టెంబర్17 (ప్రజా అమరావతి): 

రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి పెద్ద పీట వేసిందనీ, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన భోజనం మెను అందిస్తున్న నేటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) రాజన్న దొర అన్నారు. తిరుపతి పట్టణంలో బైరాగి పట్టెడ లోని గిరిజన సంక్షేమ వసతి గృహం గురుకుల పాఠశాలగా మార్పు కాబడిన పాఠశాలను మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో విద్యార్థుల ఎన్రోల్మెంట్ హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 230 మంది విద్యార్తినులకు గాను 220 మంది హాజరయ్యారని పాఠశాలలో టీచర్లు కొరత ఉందని క్లాస్ రూమ్ లు అదనంగా కావాలని అధికారులు తెలుపగా వాటికి సంబంధిత అధికారులను నివేదికలు తయారుచేసి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 2.69 ఎకరాల స్థలం పట్టణంలో కలదని ప్రిన్సిపల్ తెలపగా అందులో నిర్మాణం చేపట్టడానికి ఫీజిబిలిటీ చూడాలని మంత్రి తెలిపారు. పక్కనే ఉన్న వసతి గృహాన్ని కొంత భాగం గురుకులానికి ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రాజెక్ట్ అధికారిని  ఆదేశించారు. అనంతరం పిల్లల వసతి మరియు కిచెన్ పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఒకటవ తరగతి నుండి ఎంఏ వరకు గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువుకున్నానని అప్పట్లో ఆహారం, వసతులు సరిగా లేకుండేవని, నేడు జగనన్న ప్రభుత్వంలో మంచి రుచికరమైన నాణ్యమైన భోజనం విద్యార్థిని విద్యార్థులకు అందజేస్తున్నామని, పాఠశాలల లో నాడు నేడు కింద మరమ్మతులు కాంపౌండ్ వాల్సు కట్టడం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి విధ్య అందుతుందని, విద్యార్థులు మంచిగా ఏకాగ్రతతో చదువుకోవాలని ఉన్నత స్థానాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థినుల ఆరోగ్య పరమైన అంశాలపై దృష్టిసారించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేపట్టాలని అప్రమత్తంగా ఉండాలని పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గురుకుల పాఠశాల నిర్వహణ తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నారెడ్డి కాలనీ లోని సాంఘిక సంక్షేమ స్టడీ సర్కిల్ ను సందర్శించారు


ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి చెన్నయ్య, ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ రాణి మంద, ప్రిన్సిపల్ రత్న ప్రభ, సిబ్బంది, గిరిజన విద్యార్థి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments