అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం



*అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం*



* *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా*


* *'గడప గడపకు మన ప్రభుత్వం'లో భాగంగా.. 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాలపెంటలో పర్యటన*


కడప, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే.. ప్రభుత్వ ద్యేయం అని, రాష్ట్ర ప్రజల సంక్షేమమే.. రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. 


శనివారం నగరంలోని 44వ డివిజన్ సచివాలయం-2 పరిధిలోని కాగితాల పెంటలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ఆధ్వర్యంలో సాగింది.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి.. ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారిని కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అంద‌జేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. 


ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు వైకాపా నాయకులు అఫ్జల్ ఖాన్, అహ్మద్ బాషా, 44వ డివిజన్ కార్పొరేటర్ వెల్లాల హేమలత, డివిజన్ ఇంచార్జి రామకృష్ణ రెడ్డి, మున్నా, షఫీ, పలువురు నగర కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Comments