వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో సక్రమ వలసల పై అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది




రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);




వలసకార్మికుల ప్రయోజనాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం నిమిత్తం వివిధ స్వచ్చంద సంస్థలు, విదేశాంగ శాఖ – ప్రోటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ విభాగాలు, రిజిస్టర్ద్ రిక్రూటింగ్ ఏజెంట్లు మరియు వలస కార్మికులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS  రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు నిర్వహణ.



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS వలస కార్మికుల ప్రయోజన నిమిత్తం,  బుధవారం రాజమహేంద్రవరం అరుణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో స్థానిక స్వచ్చంద సంస్థలు, వలసకార్మికులు మరియు వారి కుటుంబీకులు, స్థానిక పోలీసు మరియు రెవెన్యూ శాఖాధికారులు పాల్గొన్నారు.





APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి  మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విదేశాలకు వెళ్లే ప్రవాసాంధ్రుల అభివృద్ధి,  భద్రత, సంక్షేమమే ధ్యేయంగా  APNRTS వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో సక్రమ వలసల పై అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని


  తెలిపారు. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.  మున్ముందు స్వచ్చంద సంస్థలను కలుపుకుని వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా APNRTS పనిచేస్తుందని తెలిపారు. స్థానిక స్వచ్చంద సంస్థలు గ్రామ, పట్టణాలలోని రాష్ట్ర ప్రభుత్వ వలంటీర్ వ్యవస్థతో మమేకమై APNRTS ప్రవాసాంధ్రులకు అందించే సేవలను తెలియజేస్తూ, మనమందరం కలసి వలస కార్మికులకు సక్రమ వలసలపై  అవగాహన, అక్రమ ఏజెంట్ల ద్వారా వెళితే కలిగే ఇబ్బందుల గురించి తెలియజేద్దామని అన్నారు.  




విదేశాలకు వెళ్లే ప్రవాసాంధ్రులు అక్రమ  ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సీఈవో శ్రీ దినేష్ కుమార్ సూచించారు. APNRTS ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు 26 రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు.  కరోనా సమయంలో విదేశాలలో చిక్కుకున్న  40 వేలమంది  ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి రప్పించామని తెలిపారు.  లైసెన్స్ కలిగిన ఏజెంట్లు తెలంగాణాలో 92 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 24 మంది ఉన్నారని తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో మొత్తం 116 మంది రిజిస్టర్ద్ రిక్రూటింగ్ ఏజెంట్లు ఉన్నట్లు వివరించారు.



APNRTS  ప్రవాసాంధ్రులకు  అందిస్తున్న వివిధ రకాల ఉచిత సేవలను, సక్రమ వలస విధానాలు, అక్రమ ఏజెంట్ లను గుర్తించడం ఎలా అన్న విషయాల గురించి APNRTS డిప్యూటి డైరెక్టర్ శ్రీ కరిముల్లా వివరించారు. విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు  ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా  APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 08632340678, 918500027 678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు.



వలసకార్మికుల సమస్యల పై జరిగిన ఈ మేధోమథనంలో ఆయా సంస్థల వక్తలు వారి అనుభవాలను పంచుకున్నారు.



ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్, రాజమహేంద్రవరం – శ్రీ  శ్రీధర్ రెడ్డి,  ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ – శ్రీ శ్రీకృష్ణ, వైస్ చైర్పర్సన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – శ్రీమతి నల్లపోతు భవాని, సి.ఐ (డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్) రాజమహేంద్రవరం – శ్రీ  శ్రీనివాసరావు, ఖాదీ బోర్డు డైరెక్టర్ & కార్పొరేటర్ శ్రీమతి నిర్మలా రాణి, ఆంధ్ర మైగ్రెంట్ సర్వీస్ స్వచ్చంద సంస్థ -  శ్రీ గట్టిం మాణిక్యాల రావు, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ సభ్యులు,  పి.ఎ.ఆర్.ఏ సంస్థ సభ్యులు, రిజిస్టర్ద్ రిక్రూటింగ్ ఏజెంట్లు, శ్రీ సాయిబాబా రెడ్డి  మరియు వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అమీర్ భాషా, శేషారత్నం, కొల్లి థామస్ తో పాటు వలసదారుల కుటుంబాలు, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారు మరియు ఏపీఎన్నార్టీ సొసైటీ కువైట్ రీజనల్ కోఆర్డినేటర్స్ శ్రీ ముమ్మిడి బాలిరెడ్డి, శ్రీ నాయిని మహేశ్వర్ రెడ్డి, APNRTS సిబ్బంది,  హాజరయ్యారు.





Comments