ఎక్కడా అవినీతికి తావులేకుండా, రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా అనేక సంక్షేమ పథకాల లబ్ధి


నెల్లూరు (ప్రజా అమరావతి);


ఎక్కడా అవినీతికి తావులేకుండా, రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా  అనేక సంక్షేమ పథకాల లబ్ధి


ని ఒక్క బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


సోమవారం వెంకటాచలం మండలం ఎర్రగుంట కమ్యూనిటీ హాల్లో సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని మనుబోలు, వెంకటాచలం మండలాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పధకం కింద 3వ విడత ఆర్ధిక సాయాన్ని 6355 మంది లబ్ధిదారులకు సుమారు 12 కోట్ల రూపాయల మెగా చెక్కును మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు అందచేశారు.   ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి నెరవేరుస్తారని, అలాగే చెప్పని హామీలను కూడా నెరవేరుస్తున్నారన్నారు. ఉదాహరణకు ఈబిసి నేస్తం హామీ ఇవ్వలేదని, అయినా ఉన్నత వర్గాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రూ 15,000 ప్రతి ఏటా జమ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. 

 అర్హత ఒకటే ప్రామాణికంగా ప్రజల గడప వద్దకే సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా లక్షా 70 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 

 పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్కచెలెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించడం  జరుగుతుందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పధకం కింద   మొత్తం మూడు విడతల్లో  14,110.61 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని 75,25,663 మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.  జిల్లాలో మొత్తం మూడు విడతల్లో  645 కోట్ల రూపాయల  ఆర్ధిక సాయాన్ని 3,43,998  మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో వైఎస్ ఆర్ చేయూత పధకం కింద  మూడు విడతల్లో 86.75 కోట్ల రూపాయల  ఆర్ధిక సాయాన్ని 46,265  మంది లబ్ధిదారులకు అందించడం జరిగిందని, వెంకటాచలం, మనుబోలు మండలాలకు సంబంధించి  3వ  విడతలో 6355మంది లబ్ధిదారులకు 12 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మహిళలు చిరు వ్యాపారాలకు, వ్యవసాయ, పాడి అవసరాలకు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ఆర్థికసాయంతో పాటు చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు బ్యాంకుల తోడ్పాటును కూడా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

 అనంతరం చేయూత ఆర్థిక సహాయంతో మహిళలు ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి సందర్శించి, వారితో ముచ్చటించారు. 


ఈ కార్యక్రమంలో వెంకటాచలం, మనుబోలు ఎంపీడీవోలు శ్రీమతి సుష్మిత, శ్రీ వెంకటేశ్వర్లు, వెంకటాచలం తాసిల్దార్ శ్రీ నాగరాజు, డిఆర్డిఎ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, వెలుగు ఏ పీ ఎం వనజాక్షి, సిబ్బంది జయమ్మ, రాఘవమ్మ, ధనమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల పరిధిలోని ఎంపిటిసీలు, సర్పంచ్ లు, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments