ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తు లను ఎంతో సావధానంగా ఆలకించిన ఎంపి, అధికారులు,రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);13 వ వార్డులో కలెక్టర్ కి అపూర్వ స్వాగతం


ప్రజలతో మమేకమై వారి సమస్యలు విన్న కలెక్టర్, ఎంపి, తదితరులు


ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తు లను ఎంతో సావధానంగా ఆలకించిన ఎంపి, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలు చేరాలనే ఆశయం సక్రమంగా అమలు జరుగుతున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకోవటానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎంపి మార్గనిభరత్ తెలిపారు.


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం 13 వ డివిజన్ 31వ సచివాలయం తాడితోట.. అంబేద్కర్ నగర్ లో జిల్లా కలెక్టర్  డా. కే. మాధవీలత, స్థానిక పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి తదితరులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , నవరత్నాలు తదితర సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఎంతవరకు చేరుకున్నాయని నేరుగా లబ్దిదారుల నుంచే తెలుసుకోవడానికి గడప గడపకు సందర్శించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు సంక్షేమ పథకాలను అమలు చేసే సమయంలో కులం మతం ప్రాంతం రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు చేరాలని స్పష్టం చేశారన్నారు.  అందులో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిదులు గడపగడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ వార్డుల్లో వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అడిగి తెలుసు కుంటున్నామన్నారు. అర్హత ఉన్నా ప్రయోజనం కలుగకపోతే అటువంటి వారిని మళ్ళీ సచివాలయం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం కోసం ఈకార్యక్రమం ద్వారా ప్రజల్లోకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని కలెక్టర్ అన్నారు. అనర్హత ఉంటే అక్కడి కక్కడే వారికి వివరించి సచివాలయం చుట్టూ తిరగకుండా వివరించడం జరుగుతుందని తెలిపారు.పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళడం జరుగుతోంది అంటే రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేయడం ప్రధాన కారణం అన్నారు. గడపా గడపకు వెళ్ళే సమయంలో స్థానిక సమస్యలు తమ దృష్టికి, అధికారులు దృష్టికి తీసుకుని రావడం జరిగిందన్నారు. దశల వారీగా ఆయా సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందనీ ప్రజలకు వివరించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ను తీసుకుని వొచ్చిన ఘనత మన జగనన్న కే సాధ్యం అయిందన్నారు . ప్రతి సచివాలయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం ఇందులో భాగంగానే గడప గడపకు కార్యక్రమం లో ప్రజల నుంచి వచ్చిన స్థానిక అవసరాలు ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేస్తానని ఎంపి హామీ ఇచ్చారు.


Comments