ఉపాధి హామీ అమలులోని అన్ని సూచికల్లో మన రాష్ట్ర౦ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలి

 తాడేపల్లి (ప్రజా అమరావతి);       మారుతున్న  సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగతం చేసుకుంటూ స్థానిక ప్రజలు, అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తూ టీం ఆర్ డి అన్న భావనతో పనిచేసి ఉపాధి హామీ అమలులోని అన్ని సూచికల్లో  మన రాష్ట్ర౦  దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా విజిలెన్స్ అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో జిల్లాల పునర్విభజన అనంతరం ఎపిడిలు, డివిఓల సమావేశాల నిర్వహణలో భాగంగా 9 జిల్లాల అధికారులతో  తాడేపల్లిలోని       పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం అంటే అంటే 23- 9-2022 న సమావేశాన్ని నిర్వహించారు. 


  ఈ సందర్భంగా కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి వరకు ప్రధాన దృష్టి సారించేందుకు విడతల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని ఎపిడిలు, డివిఓలు తమ బాధ్యతలను తెలుసుకుంటూ మెరుగైన పనితీరు కనపర్చాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకుని అనుకూల ఆలోచనలతో  పనిచేయాలని ఉద్బోధించారు. సామర్ధ్యాన్ని, పనితీరును బేరీజు వేసుకుంటూ పథకం అమలుకు కళ్ళు, చెవులుగా ఉండాలని, కార్యక్రమ నిర్వహణకు ఎపిడిల వ్యవస్థ అత్యంత కీలకమైందని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ కింది సిబ్బందితో పనిచేయించాలని, విధి నిర్వహణ అన్నది చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. 


పనుల షెల్ఫ్ ఏర్పాటు నుంచి కూలీల సమీకరణ వరకు నిత్యం  పర్యవేక్షిస్తూ క్షేత్ర సిబ్బందికి, ప్రాజెక్ట్ డైరెక్టర్ కు మధ్య వారధిలా పనిచేయాలని పనుల ప్రణాళికలో ఎపిడిల బాధ్యత ఎంతో ఉందని అంటూ పేదలకు పనిని హక్కుగా ఇచ్చిన ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ కుటుంబాలకు అందేలా చూస్తూ ఎపి అంటే నెంబర్ వన్, ఎపి అంటే ట్రెండ్ సెట్టింగ్ అనేలా పనిచేయాలని, క్లస్టర్ స్థాయిలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను పరిష్కరిస్తామని, అన్ని విధాల మద్దతు ఇస్తామని తెలియజేస్తూ, ఉపాధి హామీ కార్యక్రమ విజయవంత అమలుకు రాజీలేని సూత్రాలను రూపొందిస్తున్నామని, త్వరలో వాటిని అమలు పరుస్తామని, పనిచేసే అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని కమిషనర్ కోన శశిధర్ చెప్పారు. వర్క్ సైట్ బోర్దులు, 7 రిజిష్టర్లు, పనుల నాణ్యత, షెల్ఫ్, కూలీల సమీకరణ, వేజ్ స్లిప్పుల అప్ లోడింగ్, నాటిన మొక్కల సంరక్షణ, సామాజిక తనిఖీ వంటి అంశాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరిస్తూ ఎఫ్ఎ, టిఎ, ఇసి, ఎపిఓలను నిరంతరం పర్యవేక్షిస్తూ,  రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకునే దిశగా సంబంధిత  క్లస్టర్లలో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు.  

 

ఈ సమావేశంలో ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య మాట్లాడుతూ నిబద్ధత, క్రమశిక్షణ ఎంతో అవసరమని పథకం అమల్లో మంచి ఆలోచన, పనితీరు సమీక్ష, నాయకత్వ లక్షణాలు, ప్రణాళికా నైపుణ్యం, వ్యూహం అన్నవి చాలా ముఖ్యమని క్లస్టర్ మొత్తాన్ని పర్యవేక్షి౦చుకుంటూ సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకు౦టూ ఎపిడిలు, డివిఓలు పనిచేయాలని ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య కోరారు. 


ఈ సమావేశంలో చీఫ్ క్వాలీటీ కంట్రోల్ అధికారి సుబ్బారెడ్డి, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, విజయ లాజరస్ లు ఉపాధి హామీ చట్టం, అమలు విధానాలు, ఎపిడిల విధులు, వారి బాధ్యతలు, పనితీరు సూచికలు వంటి పలు అంశాలపై ఎపిడిలు, డివిఓలకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ సమావేశంలో ఇజిఎస్ కు  సంబంధించిన  వివిధ స్థాయి అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Comments