*జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి*
**జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్**
నంద్యాల, సెప్టెంబర్ 09 (ప్రజా అమరావతి);
జాతీయ రహదారులు, రైల్వే శాఖలకు సంబంధించి భూ సేకరణ పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని... నిర్దేశిత కాలపరిమితి షెడ్యూల్డ్ కేటాయించుకుని ఆ తేదీలోగా పూర్తి చేసేందుకు ఆర్డీవోలు, తాసిల్దారులు, ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి జాతీయ రహదారుల భూసేకరణ ప్రగతిపై నేషనల్ హైవే అధికారులు, సంబంధిత ఆర్డీఓ, తాసిల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జాతీయ రహదారి 340సి కి సంబంధించిన 578 ఎకరాలు, 167కె కి సంబంధించి 545 ఎకరాలు, 340బి కి సంబంధించి 280 ఎకరాల భూములకు సంబంధించిన పనులకు నిర్దేశిత కాలపరిమితి షెడ్యూల్డ్ కేటాయించుకుని ఆ తేదీలోగా పూర్తి చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 340సి కి సంబంధించి నందికొట్కూరు నుండి ఆత్మకూరు వరకు 578 ఎకరాల్లోని 211.23 హెక్టార్ల ప్రవేట్ భూములకు బేసిక్ వ్యాల్యూను పరిగణలోకి తీసుకొని వారం రోజుల్లో ధర నిర్ధారించి భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన 13.05 హెక్టార్ల భూములను ఈనెల 16వ తేదీలోగా ఎన్.హెచ్ అధికారులకు స్వాధీనం చేయాలని సంబంధిత తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారునందికొట్కూరు నుండి ఆత్మకూరు వరకు ఐదు మండలాల్లోని 22 గ్రామాలకు సంబంధించిన స్ట్రక్చర్ విలువల సర్టిఫికేషన్ ను ఈనెల 16వ తేదీలోగా పూర్తిచేసి నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన అడిషనల్ 3డి గజిట్ పబ్లికేషన్, 20న 3జి పబ్లికేషన్ ఇవ్వాలని, కలెక్టర్ ఎన్ హెచ్ పిడిని ఆదేశించారు.
జాతీయ రహదారి 167కె కి సంబంధించి సంగమేశ్వరం నుండి నంద్యాల వరకు 545 ఎకరాలకు సంబంధించి కొత్తపల్లి, ఆత్మకూరు,* *వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల వరకు వున్న 68.57 ఎకరాల ప్రభుత్వ భూములను నవంబర్ 5వ తేదీలోగా ఎన్.హెచ్ అధికారులకు స్వాధీనం చేయాలని సంబంధిత తాసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. 476.13 ఎకరాల ప్రవేట్ భూములకు సబ్ డివిజనల్ డీటెయిల్స్ పూర్తిచేసి నవంబర్ 5వ తేదీ 3డి గజిట్ పబ్లికేషన్ ఇవ్వాలన్నారు. ఈ నెల 10 నుండి పెగ్ మార్కింగ్ ప్రారంభించి వచ్చే నెల 10 వ తేదీలోగా పూర్తి చేయాలని స్నేహకిరణ్ కన్సల్టెన్సీ ప్రతినిధులను కలెక్టర్ ఆదేశించారు. పెగ్ మార్కింగ్ తో పాటు స్ట్రక్చర్ వేల్యూస్, ఎంజాయ్మెంట్ డీటెయిల్స్ సేకరించాలని సంబంధిత తహసిల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.340 బి కి సంబంధించి సోమయాజుల పల్లి నుండి డోన్ వరకు 280 ఎకరాలకు స్ట్రక్చర్ వేల్యూస్, ఎంజాయ్మెంట్ డీటెయిల్స్ పూర్తి చేసి ఈ నెల 17వ తేదీ క్యాప్టిల్ 3ఏ గజిట్ పబ్లికేషన్ ఇవ్వాలని డోన్ ఆర్డీవో ను ఆదేశించారు.
ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ బలరామకృష్ణయ్య, డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎమ్.దాసు, నేషనల్ హైవే తాసిల్దార్ గుర్రప్ప శెట్టి, సంబంధిత మండల తాసిల్దార్లు, జాతీయ రహదారుల డిటి రామాంజనేయులు, ఆర్డబ్ల్యుఎస్, ఆర్అండ్బి, హార్టికల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment