బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది

 బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి 

  ప్రధాన పాత్ర  నిర్వహిస్తుంది

జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


పుట్టపర్తి, సెప్టెంబర్ 21(ప్రజా అమరావతి):  బహుళ వ్యాధుల నివారణలో హోమియోపతి ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ గారు  పేర్కొన్నారు. బుధవారం  పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం సమీపమున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఆయుష్ శాఖ  శ్రీ ఆర్ వి  జానకి రామయ్య  ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కే కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రోజుకు సుమారు 90 మంది ఓ పి  సంఖ్య  నమోదవుతుందని డాక్టర్ తెలిపారు.  ఆసుపత్రి లో గల మందులను, ఓ పి రిజిస్టర్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు, నూతన మందులు అందుబాటులో ఉంచుకోవాలని  డాక్టర్ ను ఆదేశించారు. ప్రజలకు  ఈ  ఆసుపత్రి సేవలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   వ్యక్తిగత నివారణ హోమియోపతి ప్రత్యేకత అని తెలిపారు.  అనారోగ్య లక్షణాల వంటి వాటినన్నిటిని పరిగణలోకి తీసుకొని  నివారణ  పక్రియ ను  ప్రారంభించక పోతే, వ్యాధి మరల తిరగబెట్టవచ్చు అనేది హోమియోపతి  విధాన నమ్మకం. మనకు రోజువారీ సంభవించే వైరల్  జ్వరా లు, జలుబు అలర్జీ లు, చిన్న చిన్న గాయాలు, తలనొప్పి , పులిపిరి కాయలు, నల్ల మచ్చలు,  పోడలు  వంటి శారీరక సమస్యలు, కండరాలు నొప్పులు వంటి వాటికి హోమియోపతి సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. నేను కూడా హోమియోపతి ని వాడుతున్నాం అని తెలిపారు

ఈ కార్యక్రమంలో కాంపౌండర్ మహేష్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



Comments