ఉత్తమ ప్రతిభతో పతకాలు సాదించిన పోలీస్ శాఖ క్రీడకారులను అభినందించిన డి‌జి‌పి రాజేంద్ర నాథ్ రెడ్డి.


డి‌జి‌పి కార్యాలయం (ప్రజా అమరావతి);

*క్రీడల విభాగం.*  


*పోలీస్ శాఖలో పనిచేస్తు ఉత్తమ ప్రతిభతో  పతకాలు సాదించిన పోలీస్ శాఖ క్రీడకారులను అభినందించిన డి‌జి‌పి రాజేంద్ర నాథ్ రెడ్డి.*



CISF అధ్యర్యంలో ఈ నెల 19 నుండి 24 వరకు ఢిల్లీలో నిర్వహించిన 7వ జాతీయ పోలీసు జూడో క్లస్టర్ పోటీలలో 28 రాష్ట్రాలకు చెందిన పోలీస్ క్రీడకారులు, ప్యారమిలిటరీ, ఐ‌టి‌బి‌టి ఫోర్సెస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్  శాఖ కు చెందిన 20 మంది పురుషులు మరియు మహిళలు పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో వివిధ విభాగలలో *ఆంధ్రప్రదేశ్‌కు 2-వెండి, 5-కాంస్య పతకాలు మొత్తం 7 పతకాల*ను సొంతం చేసుకుంది.నంద్యాల జిల్లాకు చెందిన ఎస్. ఫరాహతుల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన డి.ఎన్.వి. రత్నం బాబులు పెన్కాట్ శిలాట్ విభాగము నందు వెండి పతకాలు, నెల్లూరు జిల్లాకు చెందిన ఎ. శ్రావణి కరాటే నందు, కర్నూలు జిల్లాకు చెందిన పి. కల్పన, నంద్యాల జిల్లాకు చెందిన ఎస్. మహబూబ్ బాషా, చిత్తూరు జిల్లాకు చెందిన యం. షంషేర్‌లు త్వైక్వాండో నందు కంచు పతకాలు సాధించారు.


*డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కె. రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.ఎస్.* గారు  మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం చేస్తూ కూడా క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పోలీసు వ్యవస్థకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి, నగదు బహుమతి అందజేయడం జరిగినది. ఈ పతకాలు గెలవడంలో కీలక పాత్ర వహించి, వారికి అవసరమైన అన్ని క్రీడా వసతులు సమకూర్చిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంక్షేమ మరియు క్రీడల ఐ.జి.పి. ఇన్‌ఛార్జి శ్రీ ఎల్.కె.వి. రంగారావు ఐ.పి.ఎస్. గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీ కె.వి. ప్రేమ్‌జిత్ మరియు స్పోర్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments