ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి



నెల్లూరు, సెప్టెంబర్ 3 (ప్రజా అమరావతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  సూచించారు. 

  శనివారం ఉదయం నెల్లూరు పొదలకూరు రోడ్డులోని మంత్రి వారి క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వైద్యాధికారులు ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆసుపత్రుల పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. 


Comments