లేడీ కండక్టర్ల డ్యూటీల కేటాయింపులో పారదర్శకంగా ఉండాలి


లేడీ కండక్టర్ల డ్యూటీల కేటాయింపులో పారదర్శకంగా ఉండాలి

- ఆర్టీసీ ఉన్నతాధికారులకు 'వాసిరెడ్డి పద్మ' ఆదేశం


రాజమండ్రి (ప్రజా అమరావతి):

మహిళా కండక్టర్లకు ఓవర్ టైమ్ డ్యూటీల కేటాయింపు సరికాదని, విధుల చార్ట్ విషయంలో పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచనలిచ్చారు. స్థానిక ఆర్అండ్ బీ అతిథిగృహంలో తూర్పుగోదావరి జిల్లాల మహిళా కండక్టర్లతో ఆమె సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో విధుల్లో మహిళా కండక్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ డిపోల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు,  దుస్తులు మార్చుకునే గదులు,  ప్రత్యేక భోజన గదులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు వాసిరెడ్డి పద్మ కోరారు.మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు,చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయించేందుకు కృషిచేస్తామని ఆమె హామీనిచ్చారు. అక్టోబర్ ఒకటోతేదీన మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించే 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' అందరూ పాల్గొనాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమం లో  మహిళా కమిషన్ సభ్యులు షేక్ రుకియాబేగం, ఆర్టీసీ డీపీటీవో షర్మిల, 9 డిపోల మేనేజర్లు, మహిళా కండక్టర్లు పాల్గొన్నారు.


Comments