దసరా మహోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.06-09-2022 న గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావు, IAS గారు, నగర పోలీసు కమీషనర్ శ్రీ టి.కె.రాణా, IPS గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు దేవస్థానం నందు నిర్వహించు దసరా -2022 మహోత్సవములు ఏర్పాట్లును పరిశీలించారు.
అందులో భాగంగా ప్రసాదం కౌంటర్ లను ఏర్పాటు చేయు ప్రదేశాలు, క్యూ లైన్ లను, మెట్లమార్గం, లిఫ్ట్ మార్గం, నడక మార్గం, పార్కింగ్ ప్రదేశాలు మరియు ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్న భద్రత మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించి, చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీ విశాల్ గున్ని, ఐ.పి.ఎస్., గారు, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్. గారు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. శ్రీ టి.సర్కార్ గారు, పశ్చిమ ఏ.సి.పి. డా. కె.హనుమంతరావు గారు, ట్రాఫిక్ ఏ.సి.పి. శ్రీ రామచంద్ర రావు గారు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు గారు, శ్రీమతి లింగం రమాదేవి గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment