విద్యతో గౌరవం వికసిస్తుంది -- కన్నా లక్ష్మీనారాయణ

 విద్యతో గౌరవం వికసిస్తుంది

          -- కన్నా లక్ష్మీనారాయణ


   విద్యతో ప్రజలలో గౌరవం వికసిస్తుందని మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

 ఈనెల 10వ తేదీ కౌoడిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గెస్సి నాలెడ్జ్ హబ్ ఆవరణంలోకౌండిన్య ఐఏఎస్ అకాడమీ వద్ద పెద్దకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మొక్కలు నాటి కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కౌoడిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డా:: ఇ.వి. నారాయణ అధ్యక్షత వహించారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ గత 18 సంవత్సరాలుగా ఇ.వీ నారాయణ కౌoడిన్య ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు కోటి 50 లక్షల రూపాయలు స్కాలర్షిప్ లను  అందించడం అభినందనీయం అన్నారు. ప్రతిభ గల  పేద విద్యార్థులకు సరైన శిక్షణ, తర్ఫీదు అందించి, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి గెస్సీ  నాలెడ్జ్ హబ్ ద్వారా కౌoడిన్య  ఐఏఎస్  అకాడమీని స్థాపించడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు,  మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ. తన సహచరుడు ఇవి నారాయణ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన తరువాత వందలాదిమంది దాతలను సమీకరించి వేలాదిమంది పేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం శుభ పరిణామం అన్నారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలను దాతల నుండి సమీకరించి పేద విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల నియామకాల లో సరైన శిక్షణ అందించడానికి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ని స్థాపించి , 2023 జనవరి నాటికి ప్రారంభానికి కృషి చేయటాన్ని స్వాగతించారు.కౌoడిన్య ఐ.ఏ.ఎస్. అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వీ నారాయణ  ప్రసంగిస్తూ పేద విద్యార్థుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కౌoడిన్య ఎడ్యుకేషనల్  ట్రస్ట్, గౌడ జన సేవాసమితి,కౌండిన్య ఐఏఎస్ అకాడమీ లను ఆదరిస్తున్న దాతలు అందరికీ అభినందనలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో వాకా రామ్ గోపాల్ గౌడ్, జల్లెడ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ మువ్వ విజయలక్ష్మి, ప్రొఫెసర్ ఎం. కోటేశ్వరరావు , వి. సుబ్బారావు, పామర్తి సాంబశివరావు, చిలక చంద్రమౌళి, చెన్ను శ్రీనివాసరావు, అనంత లక్ష్మీనారాయణ,పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ నారగాని కృష్ణ  తదితరులు ప్రసంగించారు.

Comments