_బియ్యం,ఇసుక,మద్యం, గుట్కా మాఫియా,దొంగల ముఠాకు నాయకుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడని..

 *_బియ్యం,ఇసుక,మద్యం, గుట్కా మాఫియా,దొంగల ముఠాకు నాయకుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడని_**_టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ఆరోపించారు_*


_*క్యాపిటల్ వాయిస్ వినుకొండ* శుక్రవారం సాయంత్రం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీ.వి మాట్లాడుతూ పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమంగా తరలిస్తూ విచ్చలవిడిగా రేషన్ దోపిడీ చేస్తున్నారని అన్నారు._


_మా హయాంలో అక్రమ రేషన్ తరలింపు పై 72 కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చెప్తున్నారంటే అక్రమ రేషన్ తరలింపులో ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఏ స్థాయివో అవగతం అవుతుందన్నారు._


_గోనుగుంట్లవారిపాలెం అక్రమ రేషన్ కేసులో ఉన్న నీ బంధువులను తప్పించి మాఫీ చేసే ప్రయత్నం చేయలేదని ఎమ్మెల్యేని ప్రశ్నించారు._


_ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఓటమి భయం పట్టుకొని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు._


_కల్తీ పాలు అమ్మడం, శాతాలతో రైతులను మోసం చేయడం అంతా సులువు కాదు ఆరోపించడం అని అన్నారు._


_అభివృద్ధి చేస్తుంటే జీ.వి ఆంజనేయులు కేసులు వేయిస్తున్నారని ఎమ్మెల్యే ప్రచారం చేయటం అతని దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు._


_కేసులు వేయించే సంస్కృతి నాది కాదని నీవు నియంత్ర వ్యవహరిస్తుంటే హక్కు ఉన్నవాడు కోర్టును ఆశ్రయిస్తుంటారని అన్నారు._


_టిడిపి హయాంలో తెచ్చిన జీవోలు, నిధులతో మిగిలిన పనులు చేస్తూ తాను అభివృద్ధి చేస్తున్నానటం సిగ్గుచేడున్నారు._


_మూడేళ్ల వైసిపి పాలనలో వినుకొండ అభివృద్ధికి కొత్తగా ఒక్క ఆలోచన ఉందా అని ప్రశ్నించారు._


_గడపగడపకు మీరు తిరుగుతున్న రోడ్లు మేము వేయించినవెనన్న వాస్తవం తెలుసుకోవాలన్నారు._


_నీ విల్లాస్ కోసం కొండ చుట్టూ గిరి ప్రదర్శన రోడ్డు వేస్తూ అభివృద్ధి అంటూ ప్రజలను చేస్తున్న మోసం త్వరలో అర్థం అవుతుంది అన్నారు._


_గతంలో తనపై ఎన్నో ఆరోపణలు చేసిన బొల్లా బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చాక ఒకటి నిరూపించారని, దమ్ముంటే ఆరోపణల పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు._


_అఖిలపక్షాల సమక్షంలో తాను చర్చకు సిద్ధమని మీ అవినీతి అక్రమాలు నిరూపిస్తామని అన్నారు._ 


_సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు...!!_

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image