శ్రీ శక్తి స్వరూపిణి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారికి సారె సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి



 *శ్రీ శక్తి స్వరూపిణి తాతయ్య గుంట గంగమ్మ తల్లి అమ్మవారికి సారె సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి



తిరుపతి, సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి):  తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన బాగంగా తిరుపతి పట్టణం లోని  శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని  ముఖ్య మంత్రి హోదాలో తొలిసారి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.


మంగళవారం సాయంత్రం  స్థానిక  శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో  శాసన సభ్యులు కరుణా కర రెడ్డి, చైర్మన్ గోపి యాదవ్, ఈ ఓ మునెయ్య, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు.


అనంతరం అమ్మవారి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించిన  ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం  చేశారు. 


ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు

రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కే నారాయణస్వామి, రాష్ట్ర పర్యాటక, క్రీడాలు,యువజనలశాఖ మంత్రి ఆర్కే రోజా ,టీటీడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి, రాజ్య సభ ఎంపి వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఎంపీ లు గురుమూర్తి, రెడ్డప్ప, మిథున్ రెడ్డి,  ఎంఎల్సీ కళ్యాణ చక్రవర్తి, భరత్, ఎం ఎల్ ఏ లు తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పీలేరు  భూమన కరణాకరరెడ్డి, కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మేడ మల్లికార్జున , తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, తిరుపతి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి,  ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ సునీత, ఆలయ సిబ్బంది తదితరులు వున్నారు.


Comments