వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు పై రైతులకు ఇబ్బంది కలగదు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి

 *వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు పై రైతులకు ఇబ్బంది కలగదు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి


*


కర్నూలు, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి):వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు పై రైతులకు ఎలాంటి  ఇబ్బంది కలగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి స్పష్టం చేశారు..


శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చ కార్యక్రమం అనంతరం ఆయన   మీడియాతో మాట్లాడా రు..


వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు పై రైతులు అపోహ పడవద్దు అని ఆయన సూచించారు..ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజ శేఖర రెడ్డి అని, ఆయన కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఆశయాలను అమలు చేస్తాడని, రైతులకు ఇబ్బంది కలిగే విధంగా చేయడని ఆయన తెలిపారు..  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాట్లు చేసినంత మాత్రాన రైతుల మీద ఒక్క రూపాయి కూడా భారము మోపే ప్రశ్న లేదన్నారు..


రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి రూ 83 వేల కోట్లు చేసిందన్నారు. రూ.40 వేల కోట్ల విలువ కలిగిన  వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు . ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం లేదన్నారు  . ఈ రాష్ట్రంలో రైతు తన పంట నష్టపోయిన వెంటనే నష్టపరిహారం చెల్లించడం జరుగుతోందన్నారు.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన అన్ని సహాయ సహకారాలను  అందిస్తున్నామన్నారు .  రాయలసీమలో పంటలైన అరటి , బొప్పాయి , పుచ్చకాయ తదితర  పంటలకు ఢిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు .. హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. 


 రాష్ట్రంలో అమలవుతున్న ఈ క్రాపింగ్ విధానాన్ని దేశమంతా అమలు చేసేందుకు ఆలోచన చేయడం గర్వకారణం అన్నారు . , గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి  ముస్సోరీలోని ఐ.ఏ.ఎస్ శిక్షణ కేంద్రంలో పాఠాలుగా చెప్పడం  జరుగు తోందన్నారు..రైతులకు, అధికారులకు మధ్య మంచి  సంబంధాలు ఉండేలా చొరవ తీసుకోవాలని అధికారులకు నిర్దేశించామన్నారు.. 

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.. మార్కెట్ యార్డ్ లో  రైతులు తీసుకొచ్చిన పంటలు వారికి గిట్టుబాటు ధర లభించి వారు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు .

                    

          ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే , కోడుమూరు ఎమ్మెల్యే , కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లు, కె డిసిసి బ్యాంక్ చైర్మన్  తదితరులు పాల్గొన్నారు.Comments