అభివృద్ధికి ఆటంకంగా పచ్చ బ్యాచ్....

 అభివృద్ధికి ఆటంకంగా పచ్చ బ్యాచ్.... 


- పరిశ్రమలు రావటం ఇష్టం లేదా.. 

-చంద్రబాబు, యనమల సృష్టం చేయాలి 

-మూర్ఖేష్ గా మారిన లోకేష్ 

- రాష్ట్ర వైసిపి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక 

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 4 (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో అభివృద్ధి జరిగి యువతకు ఉపాధి అవకాశాలు వస్తుంటే పచ్చ బ్యాచ్ తట్టుకోలేక పోతుందని, అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని లేఖలు రాసే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు,చంద్రబాబు తమ చిత్తశుద్ధి సృష్టం చేయాలనీ రాష్ట్ర వైసిపి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ద్వజమెత్తారు. 

బల్క్‌డ్రగ్‌ పార్కు పై కేంద్రానికి, గ్రీన్ ట్రిబ్యునల్ కు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖలు రాయటం పై జమ్మలమడక స్పందించారు.తమ స్వగృహంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం సంక్షేమం మాత్రమే చేస్తున్నారనీ,పరిశ్రమలు తీసుకురావట లేదనీ నిన్నటి వరకు దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పచ్చ బ్యాచ్ నేడు వస్తున్న పరిశ్రమలను అడ్డుకుంటున్నారనీ ఎద్దేవా చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం,16 రాష్ట్రాలతో పోటీపడి,

సౌత్ నుండి  తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బల్క్‌ డ్రగ్‌ పార్కును సాదిస్తే అది వద్దు అని యనమల గ్రీన్ ట్రిబ్యునల్ కు లెటర్ రాయడంపై మండి పడ్డారు. 15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్‌ పార్కును  మన రాష్ట్రంలో రావటం వలన వేలమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, కానీ పరిశ్రమలు ఎందుకు అడ్డుకొంటున్నారో చంద్రబాబు, యనమల బహిరంగంగా సృష్టం చేయాలనీ అన్నారు. 70 శాతం వరకు చైనా నుంచి దిగుమతవుతున్న బల్క్‌ డ్రగ్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడమే  రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని, దేశవ్యాప్తంగా మూడు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లు మంజూరు కాగా గుజరాత్, హిమాచల్‌ తో పాటు ఆంధ్రకు కేటాయించటం ఆనందకరమనీ,అలాంటి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రావటం ప్రజా సంక్షేమం కోరుకునే వారు ఎవరూ నిలువరించరనీ,అలాంటిది ప్రతిపక్ష పార్టీ అడ్ఢుకోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. పర్యావరణం అని కొత్తపలుకు పలుకుతున్న చంద్రబాబుకు నేడు కొత్తగా వచ్చిన సాంకేతికత తెలియకపోవటం చిత్రంగా ఉందనీ, బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి వచ్చే ఘన. ద్రవ్యవ్యర్థాలను శుద్థి చేసేందుకు ట్రీట్ మెంట్ ప్టాంట్స్ ఏర్పాటు చేస్తారనీ, పక్క రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్క్ మాకు ఎందుకు ఇవ్వలేదని ఏడుస్తుంటే ఇక్కడ టీడీపీ మాత్రం మాకు ఎందుకు ఇచ్చారని ఏడుస్తుందనీ, ఇది టీడీపీ అసలైన నీచ బుద్దికి నిరదర్శనం అని మండి పడ్డారు. ఒక పక్క రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదంటూ దుష్ప్రచారం చేస్తూ వేల కోట్ల పెట్టుబడులు వచ్చే పరిశ్రమను వద్దని టీడీపీ కుట్రలు చేయడం పచ్చ బ్యాచ్ బుద్ధి ప్రజలు గమినిస్తున్నారనీ,  పార్కును అడ్డుకోవడం ద్వారా తుని యువతకు ఉద్యోగాలు రాకుండా యనమల అడ్డుపడుతున్నారనీ, గతంలో ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు కనీసం ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, నేడు నీతి కబుర్లు యనమల చెప్పటం దారుణం అని అన్నారు. ఫార్మా పరిశ్రమ హబ్‌గా ఆంధ్ర  రాష్ట్రం నిలిచే అవకాశం ఉంటే  ఫార్మా పార్కుపై రాజకీయాలు చేయడం దుర్మార్గమనీ రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020 ఆగస్టులోనే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందనీ,తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా పంపిందనీ,ప్రభుత్వ ప్రైవేటు ఆపరేటర్లు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసిందనీ. ఇందుకోసం ప్రత్యేక వాహక సంస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బల్క్‌ డ్రగ్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అవి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి పదేళ్లు గానీ, స్థిర మూలధన పెట్టుబడిని 125 శాతం రాబట్టుకునే వరకుగానీ జీఎస్టీని నూరు శాతం రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందనీ, యంయస్ యంఈ లకు మూలధన పెట్టుబడిలో 15 శాతం గానీ గరిష్ఠంగా 20 లక్షల వరకు గానీ రాయితీగా ఇస్తామని పేర్కొందనీ, 80 శాతం సామర్థ్యంతో మూడేళ్లపాటు విరామం లేకుండా ఉత్పత్తి చేసిన తర్వాతే రాయితీ అందజేస్తామని స్పష్టం చేసింది. కంపెనీలు చెల్లించే స్టాంపు డ్యూటీ , ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని 100 శాతం రీయింబర్స్‌ చేస్తామని తెలిపిందనీ, ఇవన్నీ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకనీ, కానీ తెదేపా, వారి మిత్ర బృందం కలిసి ఈ అభివృద్ధికి ఆటంకాలు కల్గిస్తున్నారనీ, నేడు అడపాదడపా గా ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఫ్రజలు కల్పిస్తారనీ అన్నారు. లోకేష్, మూర్ఖేష్ లా మారిపోయి కనీసం పెద్దలకు గౌరవం ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జలు రామకృష్ణ రెడ్డిలపై నోరు పారేసుకుంటున్నాడనీ, కనీస జ్ఞానం లోకేష్ నేర్చుకోవాలనీ హితవు పలికారు.

Comments