పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్ కనెక్షన్ల తనిఖీలు

 

  పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్ కనెక్షన్ల తనిఖీలు


విజయనగరం, సెప్టెంబరు 15 (ప్రజా అమరావతి)::   జిల్లాలోనున్న ప్రభుత్వ పాఠశాలల్లో, కేజీబీవీ కేంద్రాల్లో,  వసతి గృహాల్లో  ఎమ్.పి.డి.ఓ లు, ప్రత్యేకధికారులు  విద్యుత్ కనెక్షన్లను గురువారం తనిఖీ చేశారు. లూస్ కనెక్షన్లను, వేలాడే వైర్లను విద్యుత్ శాఖ సిబ్బంది తో సరి చేశారు.  బుధవారం భోగాపురం కేజీబీవీ లో జరిగిన విద్యుత్ షాక్ సంఘటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాలు జారీ చేశారు.  అన్ని పాఠశాలలలో, వసతి గృహాలలో విద్యుత్ సరఫరా, ఇతర సేఫ్టీ అంశాలను వెంటనే తనిఖీ చేసి లోపాలుంటే సరి చేయాలని కలెక్టర్ ఆదేశించిన మేరకు ఎంపిడిఓ లు హుటాహుటిన పాఠశాలల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Comments