విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి


 విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


ధర్మవరం పురపాలక  పరిధిలో కొత్తపేట బాలికల పాఠశాల  ఆవరణాల మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్*



ధర్మవరం, సెప్టెంబర్ 10 (ప్రజా అమరావతి): ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి  సంరక్షించాలిని  జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు.  శనివారం కలెక్టర్ 

ధర్మవరం పురపాలక  పరిధిలో కొత్తపేటలో గల మునిసిపల్  బాలికల ఉన్నత పాఠశాల, కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మానవ జాతి మనుగడ ఉండదని, కనుక దానిని కాపాడాల్సిన బాధ్యత  అందరిపై ఉన్నది తెలిపారు. పర్యావరణ పరిరక్షించుటకు విద్యార్థుల వయసు నుండే ప్రారంభించాలని, మొక్కలను నాటడంతో పాటు, నీరు పోసి పెంచి ,పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని తెలిపారు. ప్రతి ఇంటా, ప్రతి వార్డు, ఖాళీ ప్రదేశాలలో కూడా విరివిగా మొక్కలు నాటాలని తెలిపారు.  అందరూ కాలుష్యరహిత వాతావరణంలో జీవించాలని భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి స్వచ్ఛమైన వాతావరణమే అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని భావితరాల భవిష్యత్ కోసం  విరివిగామొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలి. పర్యావరణం పై విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రాముఖ్యతను ఇస్తూ, అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజులు కూడా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీఈవో మీనాక్షి దేవి, ఎంఈఓ సుధాకర్ నాయక్, బాలికల పాఠశాల హెచ్ఎం మేరీ కుమారి, బాలుర పాఠశాల హెచ్ఎం పద్మావతి,  ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తరులు పాల్గొన్నారు



నేటి సమాజంలో కరాటే శిక్షణ ఎంతో అవసరం... జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


 నేటి సమాజంలో కరాటే శిక్షణ ఎంతో అవసరమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో కరాటే శిక్షణ కార్యక్రమాన్ని వారు పరిశీలిస్తూ, వారి ప్రదర్శన పట్ల ముగ్ధులు అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను, చిన్న వయసు నుంచే చదువుతోపాటు, యోగ, కరాటేనుకుడా ప్రోత్సహించాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో కరాటే శిక్షణను ఉచితంగా ఇస్తున్న కరాటే మాస్టర్ను కలెక్టర్ అభినందించారు. ఈ ప్రదర్శన మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ మాస్టర్ ఇనాయత్ భాషా ఆధ్వర్యంలో జరిగింది. కరాటే పిల్లలతో కలెక్టర్ సందడిగా కాసేపు గడిపారు. 



Comments