అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలని తాపత్రయపడే ప్రభుత్వం తమది


నెల్లూరు సెప్టెంబర్ 4  (ప్రజా అమరావతి);


అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలని తాపత్రయపడే ప్రభుత్వం తమద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


ఆదివారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం టి పి గూడూరు మండలం సౌత్ ఆములూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను మంత్రి నిర్వహించారు. సౌత్ ఆములూరు గ్రామంలో అడుగుపెట్టిన మంత్రి కాకాణికి మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. యువత వెంటరాగా మంత్రి కాకాణి ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల బుక్లెట్ ను అందిస్తూ, గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు గురించి విచారిస్తూ ముందుకు సాగారు.


ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ నిర్దేశించిన నిబంధనలకు లోబడి అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, ఎక్కడైనా పొరపాటున సంక్షేమ పథకాలు అందక పోతే వారిని గుర్తించి  పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు కృషి చేస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇదేనన్నారు. సాధారణంగా మూడు సంవత్సరాల పరిపాలన పూర్తయ్యాక ఏ ప్రభుత్వమైనా ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతుందని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నoదునే ప్రజా ప్రతినిధులు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలగుతున్నారన్నారు. ప్రజలు అపూర్వంగా ఆదరిస్తూ ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు ఇస్తున్నారన్నారు.  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కేవలం మొక్కుబడిగా కాకుండా ఆయా గ్రామాల్లోని సాధారణ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా అందిస్తూ నిరుపేద ప్రజలు ఆర్థికంగా నిలదోక్కుకునేందుకు సాయపడుతున్నామన్నారు. అదేవిధంగా తాను  వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు 13 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. 


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెరుకూరు  సరళ కుమారి, ఎంపీడీవో హేమలత, తహసిల్దార్ శ్యామలమ్మ, వైయస్సార్ పార్టీ నాయకులు సుధీర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

  



Comments