గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి కుప్పం పర్యటనకు సర్వం సిద్ధం
*
*ముస్తాబైన బహిరంగ సభా వేదిక . .*
*పకడ్బందీగా సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు..*
*అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం*
*సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన గౌ. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గౌ.పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్,ఎం ఎల్ ఎ,ఎం.ఎల్.సి*
కుప్పం,సెప్టెంబర్ 22 (ప్రజా అమరావతి):
చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా
ఈ నెల 23 న శుక్రవారం నిర్వహిం చనున్న వై ఎస్ ఆర్ చేయూత మూడవ విడత నగదు జమ రాష్ట్ర స్థాయి కార్య క్రమ నిర్వహణకు సర్వం సిద్ధం అయి నది.
ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్, అనిమిగానిపల్లి వద్ద జరుగు బహిరంగ సభ లోవై.ఎస్.ఆర్ చేయూత లబ్ధిదారు లు మరియు ప్రజలు బహిరంగ సభకు పెద్ద పాల్గొననున్నం దున పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, త్రాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు, కుప్పం చెరువు వద్ద పటిష్ట భధ్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్ వద్ద గ్రీన్ రూమ్ తో పాటు బ్యారీకేడింగ్,ఇతరత్రా అన్ని సౌకర్యాలు నిర్మితం అయ్యాయి.
*బహిరంగ సభ వద్ద ఏర్పాట్ల పరిశీలన . . .*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఉదయం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణస్వామి, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు యన్.రెడ్డెప్ప, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టరు యం. హరినారాయణన్,ఎస్పీ రిషాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పలమనేరు శాసనసభ్యులు యన్.వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్ లతో కలిసి పరిశీలించారు.
కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా బహిరంగ సభ వేదిక వద్ద ఎల్ ఈ డీ స్క్రీన్ లు, బ్యారి కేడింగ్, పార్కింగ్, సీటింగ్, సభకు వచ్చే లబ్ధిదారులకు త్రాగునీటి వసతి, శానిటేషన్ తదితర సౌకర్యాల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు
మంత్రులతో పాటు ఆర్ డి ఓ శివయ్య, పి కె ఏం ఉడా ఛైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, రెస్కో ఛైర్మన్ సెంధిల్ కుమార్, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డా.సుధీర్, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ వనిత, ఎం పి పి అశ్విని, జెడ్ పి టి సి శరవణ, డి ఆర్ డి ఏ మరియు డ్వామా పి డి లు తులసి, చంద్రశేఖర్, సమగ్ర శిక్ష ఏ పి సి వెంకట రమణా రెడ్డి, డి ఈ ఓ పురుషోత్తం, డి పి ఓ లక్ష్మి, ఐ సి డి ఎస్ పి డి నాగ శైలజ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
3వ విడత వై.ఎస్.ఆర్ చేయూత ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు జిల్లాలో 1,00,685 మంది లబ్ధిదారులకు రూ.188.74 కోట్లు లబ్ధి పొందనున్నారు.
*జిల్లాలోలబ్ధిదారుల వివరాలు నియోజకవర్గాల వారీగా...*
చిత్తూరు నియోజకవర్గానికి చెందిన 11,795 మంది మహిళలకు రూ.22.11 కోట్లు
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన 13,140 మంది మహిళలకు రూ.24.63 కోట్లు
కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,307 మంది మహిళలకు రూ.28.70 కోట్లు
నగరి నియోజకవర్గానికి చెందిన 9,790 మంది మహిళలకు రూ.18.35 కోట్లు
పలమనేరు నియోజకవర్గానికి చెందిన 19,066 మంది మహిళలకు రూ.35.74 కోట్లు
పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 16,847 మంది మహిళలకు రూ.31.58 కోట్లు
పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన 14,740 మంది మహిళలకు రూ.27.63 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ.
addComments
Post a Comment