ఒక్క రూపాయికే సొంతింటి కల సాకారం

 *ఒక్క రూపాయికే సొంతింటి కల సాకారం


*


*రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 40 వేల టిడ్కో ఇళ్లు ఒక్క రూపాయికే అందచేస్తున్నాం*


*టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.10,500 కోట్ల భారాన్ని భరిస్తోంది: రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్*


*ఎమ్మిగనూరు లో 2500 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ*కర్నూలు/ఎమ్మిగనూరు సెప్టెంబర్ 23 (ప్రజా అమరావతి): రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 40 వేల టిడ్కో ఇళ్ల ను  ఒక్క రూపాయి కే అందచేసి రాష్ట్ర ప్రభుత్వం  పేదలకు  సొంతింటి కలను  సాకారం చేస్తోందని రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు .


శుక్రవారం ఎమ్మిగనూరు మునిసిపాలిటి లో శివన్న నగర్ లో  ఏ.పి. టిడ్కో ద్వారా రూ.253.79 కోట్ల వ్యయంతో  నిర్మించిన (G+3) గృహ సముదాయాన్ని  రాష్ట్ర మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవ రెడ్డి, ఏ.పి. టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్,ఏ.పి. టిడ్కో ఎం.డి. శ్రీధర్, ఎమ్మిగనూరు మునిసిపల్ చైర్మన్ కె.ఎస్. రఘు, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి,ఏ పి టిడ్కో డైరెక్టర్ లు రాఘవరావు, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు..


*ఈ సందర్భంగా రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈరోజు రెండు పండుగలు జరుగుతున్నాయని, వైయస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ. 18750 లో ఆర్థిక సహకారం  అందించడంతోపాటు ఎమ్మిగనూరులో 2500 ఇళ్లను అక్కచెల్లెమ్మల పేరిటరిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా ఒక్క  రూపాయి కే  ఉచితంగా  అందజేయడం జరుగుతోందన్నారు..


300 చదరపు మీటర్లతో  నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లకు రూ. 2.65 లక్షల రుణం కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించగా, ఈ రుణాన్ని ముఖ్యమంత్రి మాఫీ చేశారని మంత్రి తెలిపారు.. 20 ఏళ్ల రుణభారం లబ్ధిదారులు ఎలా మోస్తారని ముఖ్యమంత్రి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.. రాష్ట్రంలో మొత్తం  టిడ్కో ఇళ్లు 2.60 లక్షలు ఉండగా, ఇందులో  రూ.6.50 లక్షల తో నిర్మించిన 300 చదరపు మీటర్లు ఉన్న ఇళ్లు 1.40 లక్షలు ఉన్నాయని, కేవలం రూపాయికే ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ. 10500 కోట్ల భారం  పడుతోందన్నారు.  అంతేకాకుండా 365 చదరపు మీటర్ల ఇళ్లకు రూ. 50 వేల నుంచి రూ  25 వేలకు, 435 చదరపు మీటర్ల ఇళ్ళకు లక్ష రూపాయల నుండి  రూ.50 వేలకు తగ్గించడం వల్ల మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 11వేలకోట్ల భారాన్ని భరిస్తోందని మంత్రి తెలిపారు..


ఎమ్మిగనూరు శివన్న నగర్లో 4272 ఇళ్లను  నిర్మించడం జరిగిందని, ఇందులో దాదాపు  15 నుంచి 20వేల జనాభా ఉంటుందని, అందుకనుగుణంగా  కాలనీలను అన్ని వసతులతో, స్కూళ్లు, అంగన్వాడీలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లతో  కాలనీలను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ..ప్రస్తుతం పరిశుభ్రంగా ఉన్న ఈ కాలనీలను ఇదే విధంగా ఉండేలా వెల్ఫేర్ అసోసియేషన్ లు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాలని సూచించారు .


సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం క్రమం తప్పకుండా పథకాలను అమలు చేస్తూ 99% హామీలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మర్చిపోయి ఎన్నికలు ఆరు నెలలు ఉండగా పథకాలను తీసుకొచ్చి వ్యక్తుల తరహా తాము కాదని మంత్రి తెలిపారు.. నిజాయితీతో, నిబద్ధతతో, అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తూ, కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాల ను అమలు చేయడం జరుగుతోందన్నారు.. మూడు సంవత్సరాల్లో 1,70 వేల కోట్ల రూపాయలను ప్రజలకు అందజేశామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, బాబో జగ్జీవన్ రామ్ భావజాలంతో పేద, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు.. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారన్నారు. ఇందులో భాగంగా 30 లక్షల ఇళ్ల పట్టాలను అందించామని,  ఇందులో 20 లక్షలకు పైగా ఇళ్లకు శ్రీకారం చుట్టామని, వీటిని శరవేగంగా పూర్తి చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు.. అమ్మబడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, వైఎస్సార్ చేయూత తదితర పథకాల అమలుతో తల్లులకు,పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు..


 సభకు అధ్యక్షత వహించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయికే ఇల్లు అందించడం ఇంతకు మునుపు  భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదేమోనని  అభివర్ణించారు.. అన్ని వసతులతో టిడ్కో ఇళ్లను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.. ఎక్కాలనేని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామన్నారు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు... టెన్త్, ఇంటర్ వరకు అమ్మబడి, ఆ తర్వాత కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలకు విద్యనందిస్తున్న ఘనత సీఎం కే దక్కుతుందన్నారు.. వీటితోపాటు మధ్య వయస్సు వారికి వైయస్సార్ చేయూత, చిరు వ్యాపారులకు జగనన్న తోడు లాంటి ఎన్నెన్నో మంచి పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.


ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆరున్నర లక్షలతో నిర్మించిన ఇళ్లను రూపాయి కే అందజేసిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. దాదాపు పది లక్షల రూపాయల ఆస్తిని ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 40 వేల గృహాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.


ఏపీ టిడ్కో ఎండి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2.62  లక్షల మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను మార్చి 2023 లోపు  అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..


అంతకుముందు ఎమ్మిగనూరు లు చెందిన మహేశ్వరి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు..


అనంతరం టిడ్కో ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, మెగా కీ ని లబ్ధిదారులకు అందించారు..


సమావేశంలో వీర శైవ లింగాయత్ కార్పొరేషన్  చైర్మన్ రుద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఏపీ టిడ్కో ఎస్ ఈ రాజశేఖర్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు..Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image