భవనాల నిర్మాణం కోసం మంగళ వారం క్షేత్ర స్థాయి లో తహశీల్దార్లు పర్యటించి స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


జిల్లాలో ఎనిమిది మండలాల పరిధిలోని 19 ప్రాధాన్యత భవనాల నిర్మాణం కోసం మంగళ వారం క్షేత్ర స్థాయి లో తహశీల్దార్లు పర్యటించి స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాల


ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.


మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీవోలు, సంబంధిత మండల క్షేత్ర స్థాయి అధికారులతో  పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏ బి వి ప్రసాద్ తో కలిసి వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 1101 ప్రాధాన్యత భవనాలు నిర్మాణం లక్ష్యంగా భూములను గుర్తించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పలు మార్లు ఆదేశాలు జారీ చేసినా  మండల పరిధిలోని అధికారులు, గ్రామ స్థాయి సిబ్బంది ఆయా స్థలాలు గుర్తించడం పై ప్రేరణ కలిగించే విధంగా పనితీరు చూపక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది మరింత దృష్టి పెట్టడం ద్వారా ఆయా భవన నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించడం కష్టం కాదన్నారు. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, గోపాలపురం, కడియం, తాళ్లపూడి, పెరవలి, నల్లజెర్ల మండల తహశీల్దార్ ఈరోజు క్షేత్ర స్థాయి లో పర్యటించి స్థలాలు గుర్తించి నిర్మాణ ఏజెన్సీ కు స్థలాలు బదలాయింపు పూర్తి చేయాలన్నారు.  ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని పక్షంలో భూసేకరణ, భూ బదలాయింపు,  దాతలు ద్వారా స్థలాలు గుర్తించాలన్నారు. 


రెవెన్యూ డివిజన్ అధికారులు కూడా ఈ విషయంపై స్పష్టత తో కూడి ఉండాలని, బుధవారం సాయంత్రం నాటికి పూర్తి నివేదికలు అందచేయాలని అదేశించారు.




Comments