రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
ప్రాధాన్యత భవనాలు స్టేజ్ కన్వర్షన్ లో 451 భవనాలు ఉన్నాయని, ఆయా మండలాల్లో పెండింగులో ఉన్న వాటికి అనుగుణంగా సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకోవాల
ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.
మంగళవారం రాత్రి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పంచాయతీ రాజ్ ఎస్ ఈ .. ఏ బి వి ప్రసాద్ తో కలిసి వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో 1101 ప్రాధాన్యత భవనాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 650 భవనాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా మూడు సచివాలయాలు పరిధిలో భూములు గుర్తించాల్సి ఉందని వెంటనే తహశీల్దార్ లు, ఎంపిడివో, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో భూములను గుర్తించాలన్నారు. జీ. దొంత మూరు, గోపాలపురం, గంగొలు సచివాలయం పరిధిలో స్థలాలు గుర్తించేందుకు చర్యలు పూర్తీ చేసి, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న 451 లో 198 భవనాలు పూర్తి చేసే దశలో ఉన్నాయని వీటిలో గ్రామ సచివాలయాలు 46 ఆర్బీకేలు 56 వెల్నెస్ సెంటర్లు 96 ఉన్నాయన్నారు. జిల్లా పూర్తి చేసిన ప్రాధాన్యత భవనాలను ప్రజా ప్రతినిధులు ద్వారా ప్రారంభ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇందుకోసం తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. మిగిలిన భవనాల్లో మండలాల వారీగా స్టేజ్ కన్వర్షన్ కు అనుగుణంగా సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. స్టేజ్ కన్వెన్షన్ లో ఎక్కువ పెండింగ్ భవనాలు ఉన్న మండలాల్లో ఆయా పనులను పూర్తి చేసేందుకు సూక్ష్మస్థాయి మైక్రో ప్లానింగ్ అవసరమన్నారు. నవంబర్ చివరి నాటికి పూర్తి స్థాయి లో భవనాలు నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
addComments
Post a Comment