జగనన్న పాలనతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు


బంటుమిల్లి(కంచడం): సెప్టెంబర్ 03 (ప్రజా అమరావతి);

  

*జగనన్న పాలనతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు


*

    *--- మంత్రి జోగి రమేష్*


      రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చల్లని పాలనతో రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 

                  

      రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం, కంచడం, బోడగుంట గ్రామాల్లోని  గృహాలను మంత్రి జోగి రమేష్ సందర్శించారు. మంత్రి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో వారు పొందిన లబ్ధిని వివరించారు.

      ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శమని, ఎలాంటి పక్షపాతం, రాజకీయ, కులమత భేదాలు చూపకుండా అర్హులైన ప్రతి మనిషికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. నవరత్నాలు అమలుచేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల గడప వద్దకే చేర్చారాన్నారు. చల్లని పాలనను మనకు అందిస్తున్న మన జగనన్నను మీ మనసుల్లో దీవించాలని ప్రజలను మంత్రి కోరారు. 

      

         గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగ, త్వరలో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, శ్మశానవాటిక కోసం స్థలమును కేటాయిస్తామని  ఆయన వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా నిర్మాణంలో ఉండి అసంపూర్తిగా నిలిచిపోయిన కంచడంలోని కమ్యూనిటీ హాలు నిర్మాణానికి గ్రామస్థుల అభ్యర్థన మేరకు నియోజకవర్గ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అందుకు గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

          కార్యక్రమానికి ముందు మంత్రి బోడగుంటలో రూ.7 లక్షల నిధులతో నూతంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి గ్రామస్థులు పూలతో ఘన స్వాగతం పలికారు.

              ఈ  కార్యక్రమంలో బంటుమిల్లి జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ రాజబాబు, కంచడం ఎంపీటీసీ పాపాని భగవాన్, కంచడం గ్రామ సర్పంచ్ బండారు చంద్రశేఖర్, బంటుమిల్లి ఎంపిపి వెలివెల చినబాబు,సుజ్ఞానం మహేష్, పాలడుగు బాబూరావు, ఒడిమి చిన్నారిబాబు, కమాల్ భాషా, బంటుమిల్లి ఎంపిడిఓ స్వర్ణకుమారి, బంటుమిల్లి తాసిల్దారు సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image