మధ్యాహ్న భోజనం సక్రమంగా పెడుతున్నారా

 

నెల్లూరు, (ప్రజా అమరావతి);

రాష్ట్ర ఆహార కమీషన్ ఛైర్మన్ శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి గురువారం ఉదయం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను, జిల్లా పౌర సరఫరా సంస్థ మండల స్టాక్ పాయింట్ ను సందర్శించి, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పధకం, పౌష్టికాహార పధకం అమలు తీరును,  రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు.


తొలుత ఫుడ్ కమీషన్ ఛైర్మన్ శ్రీ విజయ ప్రతాప్ రెడ్డి బుజబుజనెల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం పధకం అమలును పరిశీలించి, స్టాకు రిజిస్టర్స్ ను,  హాజరు రిజిస్టర్ ను  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విద్యార్థులు తో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం సక్రమంగా పెడుతున్నారా


అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బుజబుజనెల్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని వేదాయపాలెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. అంగన్వాడీ పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పట్ల ఛైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి  వెంగళరావునగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఇంట్రాక్టు అయి మధ్యాహ్నం భోజనం అమలు తీరుతెన్నులను తెలుసుకున్నారు.  తదుపరి కొత్తూరులోని జిల్లా పౌర సరఫరా సంస్థ  మండల స్టాక్ పాయింట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార కమీషన్ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పధకం అమలును, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అమలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోవడానికి ఈరోజు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు  తెలిపారు. పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో  మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం  అమలు పట్ల సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.


ఫుడ్ కమిషన్ చైర్మన్ వెంట డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర రావు, పౌర సరఫరాలు  డిఎం శ్రీమతి పద్మ, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రమేష్ బాబు, ఐసీడీఎస్ పిడి ఉమామహేశ్వరి, సీడీపీఓ శ్రీమతి విజయలక్షి,  ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ వెంకటేశ్వర రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పరిమళ  తదితరులు పాల్గొన్నారు.


Comments