అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
– టీటీడీ సేవలపై భక్తుల అభినందన
తిరుమల 23 సెప్టెంబరు (ప్రజా అమరావతి): మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు . అనేక మంది భక్తులతో అన్న ప్రసాదం రుచి , నాణ్యత ,వడ్డిస్తున్న విధానం గురించి అడిగారు . అన్నప్రసాదం చాలా బాగుందని భక్తులు ప్రశంసించారు . కల్యాణకట్ట , దర్శనం , వసతి కి సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగారా అని ఆరా తీశారు . భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు . శ్రీవారి సేవకులతో చైర్మన్ మాట్లాడుతూ , వారికి వసతి , సేవ పొందిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు . అనంతరం శ్రీ సుబ్బారెడ్డి భక్తులతో కలసి భోజనం చేశారు .
అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి , ఏవీఎస్వో శ్రీ సాయిగిరిధర్ చైర్మన్ వెంట ఉన్నారు.
addComments
Post a Comment