పేదవాడు పేదరికాన్ని జయించాలనే ఉద్దేశ్యం తోనే వివిధ సంక్షేమ పథకాలు అమలు

 

 రామచంద్రపురం

సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);

రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పేదవాడు పేదరికాన్ని జయించాలనే ఉద్దేశ్యం తోనే వివిధ సంక్షేమ పథకాలు అమలు


చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు.

 రామచంద్రపురం నియోజకవర్గంలో ని రామచంద్రపురం అర్బన్ లో వైస్సార్ చేయూత లబ్ధిదారులతో విజయ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన  కార్యక్రమంలో మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు కష్టాలు, మోస్తున్న కుటుంబ బరువు ప్రత్యక్షంగా గమనించి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల వారికి వై ఎస్ ఆర్ చేయూత పథకం రూపొందించి నాలుగు సంవత్సరాల్లో 75 వేల రూపాయలు ప్రకటించి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు కుల,మత, వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా వైఎస్ఆర్ చేయూత అనే గౌరవ ప్రధమైన పథకాన్ని ప్రవేశపెట్టి నాలుగు దఫాలుగా 75000 రూపాయలు నిజాయితీతో అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా లబ్ధిదారులకు 56,500 రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని మహిళలు తమ పిల్లలు అవసరాలు తీర్చుకోవడం తో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. స్థానికంగా జరుపుకునే చిరు వ్యాపారులు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు శిథిలావస్థలో ఉన్న ఘటనలు గమనించిన ముఖ్యమంత్రి నాడు-నేడు కార్యక్రమాల ద్వారా కార్పొరేట్ తరహా విద్య అందించే విధంగా పాఠశాల భవనాలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పిల్లలకు మూడు జతల యూనిఫాం, షూ, పుస్తకాలు అందించడం జరిగిందని తల్లులు తమ పిల్లలు చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో మన పిల్లలు ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు.  జీవితంలో ఏదీ శాశ్వతం కాదని విద్య, విజ్ఞానంమే మనుగడకు దోహదపడుతుందని ఆ సంకల్పంతోనే ముఖ్యమంత్రి విద్యా వికాసానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు అన్నారు .పాలన వికేంద్రీకరణ లో సేవలు అందుబాటులో ఉండేందుకు వార్డు సచివాలయ లతోపాటు వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.  

ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డు తో ఎంతో మందికి ప్రాణం పోసారన్నారు. అదే తరహాలో వై యస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు కార్పొరేట్ తరహాలో 3188 వ్యాధులకు వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా,

గర్భిణీ స్త్రీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా  108 కింద1088 వాహనాలు,  చికిత్స అనంతరం ఇంటి దగ్గర సేవల కోసం   ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా  మంత్రి రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఐనా రైతు భరోసా ,ఆరోగ్యశ్రీ ఆసరా,  పెన్షన్లు, గృహ నిర్మాణాలు లాంటి పథకాల గురించి సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా  రామచంద్రపురం పట్టణ 1674 మంది లబ్ధిదారులకు 

3 కోట్ల 13 లక్షల 87 వేల విలువగల చెక్కును మంత్రి అందజేశారు.

రామచంద్రపురం పురపాలక సంఘం చైర్మైన్ గాదం శెట్టి శ్రీదేవి కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు తో పాటు సంబంధిత శాఖల అధికారులు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. 



    


Comments