గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి); 


* అనపర్తి, రాజానగరం నియో జకవర్గాల్లో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.


*  జిల్లా కలెక్టర్ డా  కె. మాధవిలతఅనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల


ని జిల్లా కలెక్టర్ డా  కె. మాధవి లత అన్నారు. మంగళవారం స్థానిక  జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఆధికారులు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గం లో 7252 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1806 ఇళ్ళు పూ ర్తి అయ్యాయని 5446 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.  అనపర్తి నియోజకవర్గం లో 9324 ఇళ్ళు నిర్మించి పూర్తి చేయాల్సి ఉండగా 1136 ఇళ్ళు పూర్తి అయ్యాయన్నారు.  8188 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.   వర్షాలు తగ్గాయి కాబట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు నూరు శాతం పూర్తి  అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 


ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు ప్రతిరోజు గృహ నిర్మాణాలపై మండల స్థాయిలో హౌసింగ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లుతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. మండలాల్లో ఇసుక, సిమెంట్ , ఇనుము కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.  ప్రతీ ఇంటికి 20 టన్నుల ఇసుక ను హోసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కూపన్లు ఏర్పాటు చేసి, ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ వారం రోజుల్లో లక్ష్యాల్లో భాగంగా కోరుకొండ మండలం లో 311 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 24 ఇళ్ళు పూర్తి చేయడం జరిగిందన్నా రు. రాజానగరం లో 466 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 93 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.

సీతానగరం లో 185  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 13 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.  అనపర్తి లో 438  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 34 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు.  బిక్కవోలు లో 390  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 45  ఇళ్ళు పూర్తి చే యడం జరిగిందన్నారు.  రంగం పేట లో 647  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 98 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసే దిశలో వారానికి లక్ష్యం పెట్టుకుని, సచివాలయ కార్యదర్శి లకు ఒక్కొక్కరికి ట్యాగ్ చేయ్యాడం ద్వారా మరింత గా పనుల పర్యవేక్షణ, స్టేజ్ కన్వర్షన్ సాధ్యం అవుతుందని,. ఆ దిశలో చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఈ. ఈ, జి. పరశురామ్, డి. ఈ, జి. వేణుగోపాల స్వామీ నియోజకవర్గాల మండల తా హిసీల్దార్ లు, యం. పి. డి. ఓ లు, ఇరిగేషన్, సర్వే అధికా రులు పాల్గొన్నారు.Comments