మహిళా కమిషన్ - సబల రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్స్ పోటీల విజేతలు వీరే...
అమరావతి (ప్రజా అమరావతి):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "సబల" రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ల పోటల విజేతలను శుక్రవారం ప్రకటించారు. రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజేతల వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు ఒకటో తేదీన షార్ట్ ఫిల్మ్ పోటీలకు సంబంధించిన ప్రకటన విడుదల చేయగా.. ఔత్సాహిక బృందాల నుంచి లఘుచిత్రాల సమర్పణకు సెప్టెంబరు నెలాఖరును గడువు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 లఘుచిత్రాలు దాఖలు కాగా, అందులో ఉత్తమ చిత్రాలను న్యాయనిర్ణేతలు ఎంపిక జేశారు.
విజేతలు వీరే..
------------------
మొదటి బహుమతి పొందిన ఉత్తమ చిత్రంగా కాకినాడ జె. ఎంటర్టైన్మెంట్ కి చెందిన 'ఆమె' షార్ట్ ఫిల్మ్ రూ. లక్ష బహుమతి కైవసం చేసుకుంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా షారోన్ ఫిలింస్ (గుంటూరు, గోరంట్ల) బ్యానర్ పై నిర్మించిన 'సబల' షార్ట్ ఫిల్మ్ నిలిచి రూ. 50 వేలు దక్కించుకుంది. అదేవిధంగా రాజమండ్రికి చెందిన మైరా క్రియేషన్స్ వారి 'రాధిక' షార్ట్ ఫిల్మ్ తృతీయ బహుమతి కింద రూ. 25 వేలు అందుకోనున్నారు. నాలుగు వ్యక్తిగత బహుమతుల కింద ఒక్కోక్కరికి రూ. 20 వేలు చొప్పున అందించనున్నారు. వీరిలో ఉత్తమ నటిగా బండారు నాగరాణి (సబల), ఉత్తమ నటుడిగా సూర్య ఆకొండి (ఆమె), ఉత్తమ రచయితగా పి. మల్లిఖార్జున ( నరరాక్షస), ఉత్తమ దర్శకునిగా బాల (దిశ ది పవర్ ఆన్ ఉమెన్) ఎంపికయ్యారు. ఇవి కాకుండా మరో ఐదు లఘుచిత్రాలను ప్రత్యేక విభాగంలో ఎంపిక జేశారు. ఒక్కో చిత్రానికి రూ. 20 వేల చొప్పున అందజేయనున్నారు. వీటిల్లో యూనివర్సల్ క్రియేషన్స్, రాజమండ్రి వారి 'నాకు మీరు - మీకు నేను', వంశీ మీడియా - చిలకలూరిపేట వారి 'భవిత', డ్రీమ్ మేకర్స్ వారి 'స్వేచ్ఛ', సత్తి రత్నకుమారి బ్యానర్ పై 'మహిళలు మీకు వందనాలు', ఎంకే ప్రొడక్షన్స్ వారి 'సర్వం సబల శక్తిమయం' విజేతలుగా నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు మహిళా కమిషన్ తరఫున ప్రశంశ పత్, ప్రభుత్వ జ్ఞాపికను అందజేయనున్నారు.
addComments
Post a Comment