ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్, పోలవరం విలీన మండలాల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్, పోలవరం విలీన మండలాల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు.



పోలవరం విలీన మండలాల్లోని మున్నూరు కాపు కులస్తులకు బీసీ–డీ కింద గుర్తింపు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 


ఇటీవల సీఎంని కలిసి తమను బీసీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసిన విలీన మండలాల్లోని మున్నూరు కాపులు.


సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మున్నూరు కాపు సంఘం నాయకులు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి, మున్నూరు కాపు సంఘం ఎటపాక డివిజన్‌ ప్రెసిడెంట్‌ ఉమాశంకర్, నాయకులు వెంకటేశ్వర రావు, నాగేంద్ర, శివాజి, నాగేశ్వరరావు, నాగ సూర్యనారాయణ, రాహుల్‌ నాయుడు.

Comments