జిల్లాలో పర్యాటకం శోభిల్లాలి



*జిల్లాలో పర్యాటకం శోభిల్లాలి*



పార్వతీపురం, సెప్టెంబర్ 28 (ప్రజా అమరావతి) : జిల్లాలో పర్యాటకం శోభిల్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో ఎకో టూరిజం క్రింద గిరిజన ఒకటి, రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులు ఒక రోజు గ్రామంలో గడిపి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద కన్వెన్షన్ సెంటర్, వ్యూ పాయింట్, ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఇందుకు పార్వతీపుం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులతో సహా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.  భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్, రివర్ ఫ్రంట్ కాటేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బ్యాటరీ ట్రైన్ సౌకర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించుటకు అవకాశాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పర్యాటక, జాతీయ రహదారి కలుపుతూ తూర్పు కనుమల కారిడార్ (ఈస్టర్న్ ఘాట్స్ కారిడార్) ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని, సామాన్య ప్రజల ఆదాయం వృద్ది చెందగలదని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెండు నుండి ఐదు ఎకరాల స్థలంలో శిల్పారామం, బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో టూరిజం కార్పొరేషన్ డివిజన్ (ఎకో టూరిజం) కార్యాలయం, డెప్యూటీడిఇ , ఏఇలతో కూడిన టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. పర్యాటక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక విశేషాలు తెలియజేస్తూ వెబ్ సైట్ రూపొందించాలని, ఇతర ప్రధాన వెబ్ సైట్లుతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. 


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image