ద్వారంపూడి ఫెయిల్యూర్ & ఫేక్ ఎమ్మెల్యే నగరంలో రివర్స్ పాలన _ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు

 ద్వారంపూడి ఫెయిల్యూర్ &  ఫేక్ ఎమ్మెల్యే నగరంలో రివర్స్ పాలన  

_ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు


  కాకినాడ, సెప్టెంబర్ 12 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఫెయిల్యూర్ & ఫేక్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి శేఖర్ రెడ్డి అని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) అన్నారు. సోమవారం జిల్లా టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శించారు.   

   ఈ సందర్బంగా కొండబాబు మాట్లాడుతూ అవినీతి వైసీపీలో మంచినాయకులు లేక తెలుగుదేశం పార్టీ తరుపున  సైకిల్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను వైసీపీలోకి కొనుక్కుని వారికి పదవులు కల్పిస్తున్నారని దీనిని ఆ పార్టీలో ఉన్న నాయకులు గ్రహించుకోవాలని వనమాడి సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి సొంత గృహ కలను నెరవేరాలని ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా టిడ్కో గృహాలను మంజూరు చేసి మొదటి ఫేజ్లో కొన్ని గృహాలను 80శాతం నిర్మించగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ కాలంలో మిగులు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయలేని హీన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నదన్నారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టడం చేతకాక నేడు లబ్ధిదారులు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చి జగన్ రివర్స్ పాలన మాదిరిగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని, గృహ లబ్ధిదారులు అప్పు చేసి డబ్బులు కడితే నేడు ఇళ్ళు కట్టించకుండా కార్పొరేషన్కు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తున్నారని వనమాడి ఎద్దేవా చేశారు. కొమరగిరిలో సముద్రం పక్కన ఎందుకూ పనికి రాని చోట ఇళ్ళు స్థలాలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచుతున్నారని, అది పేదవాడు కోసం కడుతున్న ఇల్లులు కాదని మట్టి ఫిల్లింగ్ ద్వారా దోచుకోవడానికి కొమరగిరిలో మంజూరు చేశారన్నారు. 

   ఎన్నికల ప్రచార సభల్లో జగన్ మాట్లాడుతూ లబ్ధిదారులు కట్టిన లక్ష రూపాయలు వెనక్కి ఇచ్చి బ్యాంకు రుణం లేకుండా ఉచితంగా అందజేస్తామని మాయమాటలు చెప్పాడని,

అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.

జ్వోతుల మార్కెట్లో షాపుల నిర్మాణం పేరుతో ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ శివప్రసన్నలు   దోచుకుంటున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ నిధులు రెండు కోట్ల పది లక్షల ర్యాటిఫికేషన్ ద్వారా మంజూరు చేసి గతంలో 33 షాపులు ఉండగా నేడు క్రింద 36 షాపులు నిర్మించి పూర్వం నుండి ఉన్న వస్త్ర వ్యాపారులకు 33 దుకాణ దారులకు 25 మందికి మాత్రమే కేటాయించి మిగిలిన 8 షాపుల వస్త్ర వ్యాపారులను బెదిరించి వారికి పైన కేటాయించి కింద  ఉన్న11 షాపులను 20 లక్షలకు అమ్ముకుని దోచుకుంటున్నారని కొండబాబు తెలిపారు. మున్సిపల్ నిధులతో నిర్మాణం చేస్తున్న షాపులకు కార్పొరేషన్కు ఆదాయం రాకుండా గుడ్విల్ పేరుతో మూడున్నర కోట్లు వసూలు చేసి ఎమ్మెల్యే, మేయర్లు దోచుకుంటున్నారని తెలిపారు. గత మూడు సంవత్సరాల కాలంగా కార్పొరేషన్ అవినీతిలో మునిగిపోయిందని దీనికి రాబోయే కాలంలో అధికారులే బాధ్యులవుతారని అది అధికారులు గ్రహించాలని వనమాడి హితవు  పలికారు.                                                                        

   ఈ సమావేశంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, పలివెల రవి అనంత్ కుమార్, బంగారు సత్యనారాయణ, తుమ్మల సునీత, గుజ్జు లక్ష్మణ్ర రావు, ఎండీ ఆన్సర్, చింతలపూడి రవి, MD ఆన్సర్, గెడ్డం పూర్ణ చంద్ర శేఖర్, అమల కంటి బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

Comments