బిజినెస్ ఎక్స్ పోను సందర్శించిన 'వాసిరెడ్డి పద్మ'
రాజమండ్రి (ప్రజా అమరావతి):
రాజమండ్రి గోదావరి గట్టున రివర్ బే హోటల్, ఆహ్వానం ఫంక్షన్ హాల్ లో జె.సి.ఐ రాజమండ్రి, విశాఖపట్నం, ఐ క్యూబ్ బిజినెస్ సొల్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎంటర్ప్రెనేర్ కన్వెర్జెన్స్ అండ్ బిజినెస్ ఎక్సపో 2022ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన థింసా నృత్యబృందంతో కలిసి వాసిరెడ్డి పద్మ ఉత్సాహంగా అడుగులేసి మహిళా నృత్యకారిణులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు బిజినెస్ స్టాళ్లను సందర్శించి వారి ఉత్పాదనలు పరిశీలించారు.
addComments
Post a Comment