స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్*"స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్*


పార్వతీపురం, సెప్టెంబర్ 19 (ప్రజా అమరావతి): మక్కువ మండల కేంద్రంలో గ్రేడ్ - 5 పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న కె.అనిల్ ను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పందన కార్యక్రమం పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్పందనలో అందిన అర్జీలను తక్షణం పరిష్కరించాలని అనేక సార్లు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదేశాలను సక్రమంగా అమలు చేయకుండా, పనులను సకాలంలో పూర్తి చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడానికి తీవ్రంగా పరిగణిస్తూ సస్పెన్షన్ చేశారు. గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఏ.శ్రీనివాస రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అభియోగాలు రావడం, రుజువు కావడంతో సస్పెన్షన్ చేయాలని పంచాయితీ రాజ్ కమీషనర్ కు సిఫారసు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత సహించేది లేదని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సంఘటనతో ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలి.

Comments