అమలాపురం సెప్టెంబర్ 3 (ప్రజా అమరావతి): భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడారంగంలో రాణిస్తూ ఈ ప్రాంత ఖ్యాతిని దేశ నలుమూలల ఇనుమడింప చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా యువతకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ ను జిల్లా కలెక్టర్ వారు పౌర సన్మానంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముద్దుబిడ్డ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డికి 12 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ క్రీడాకారుడిగా రాణించాలని ఆలోచన రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారతీయులకు మెదడు షార్ప్ గా ఉంటుందని క్రీడా స్ఫూర్తి సహజంగానే ఎక్కువని మంచి పొటెన్షియల్తో క్రీడారంగంలో రాణిస్తున్నారని ఆ కోవకే చెందిన సాత్విక్ మరిన్ని విజయాలు బ్యాట్మెంటన్ క్రీడా రంగంలో సాధించాలని ఆకాంక్షించారు. చిరు ప్రాయం నుంచే కఠోర సాధన, రోజువారీ 9 గంటలు కసరత్ తో థామస్ కప్ ఫైనల్ చేరిన భారత జట్టులో సాత్విక్ కీలక భూమిక పోషించారన్నారు. బంధాలకు అనుబంధాలకు దూరంగా ఉంటూ ఇష్టాలను వదులుకొని కష్టాల సాధనకు ఉపక్రమించాడన్నారు. ఆటవిడుపుగా ఆడుతున్న సెటిల్ బ్యాట్మెంటన్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని దృఢ నిశ్చయానికి వచ్చేనాటికి ఆయన వయసు 12 ఏళ్లు మాత్రమేనని, అప్పటినుండి సాధనే జీవితంగా బతుకుతూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ వచ్చాడ న్నారు. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడన్నారు. గోపీచంద్ అకాడమీలో చిన్నప్రాయంలోనే సాత్విక్ శిక్షణ పొందాడన్నారు. రోజుకు 9 గంటల పాటు సాధన సాధన చేస్తూ వ్యాయామం ఆటల్లో మెలకువలు నేర్చుకున్నారని, జీవిత ఆశయమైన ఒలింపిక్ పధకం తృటిలో చేజారి పోయిన సాత్విక్ కుంగిపోలేదని ఓటమి నుంచి వెంటనే కోలుకొని ఆటపై దృష్టి పెట్టి ముమ్మరసాధన చేస్తూ ఫ్రాన్స్ లో జరిగిన సూపర్- 750లో ద్వితీయ స్థానంలో నిలిచాడన్నారు. గతంలో మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు పై గెలవడం ద్వారా అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సాత్విక్ మరోసారి విజయం సాధించారన్నారు. సాత్విక్ కామన్వెల్త్ క్రీడా పోటీల్లో స్వర్ణ, రజిత పథకాలు సాధించాడన్నారు. 2021 లో అర్జున్ అవార్డు అందుకు న్నాడని ,బ్యాట్మెంటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైనదని అటు వంటి మెగా టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్ కి చేరిందని ఈ జట్టులో సాత్విక్, చీరాగ్ శెట్టి జోడి ఫైనల్ కు అర్హత సాధించిందన్నారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో 1979లో మాత్రమే భారత చెట్టు ఫైనల్స్ కు చేరిందని ఈసారి జట్టు ఫైనల్ కు చేరడం, అందులో సాత్విక్ కీలక పాత్ర పోషించడం విశేషమ న్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ఒక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడని అతను భాగస్వామి, చిరాగ్ శెట్టి భారతదేశం నుండి పురుషుల డబుల్ జంట, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్‌లో అత్యధిక ర్యాంకింగ్ సాధించారన్నారు. కామన్వెల్త్ గేమ్ -2022 ద్వారా వ్యక్తిగత గోల్డ్ మెడల్, మరియు టీం సిల్వర్ మెడల్ , ప్రపంచ ఛాంపి యన్షిప్ డబుల్ ద్వారా బ్రాంచ్ మేడల్ సాధించడం అభినందనీ యమన్నారు.పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించార న్నారు.థామస్ కప్ మరియు కామన్వెల్త్ గేమ్స్‌లో వారి అద్భుత ప్రదర్శనల నుండి తాజాగా, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి సెమీఫైనల్‌కు చేరుకున్నారన్నారు. వారు మొదటి ప్రపంచ ఛాంపియన్ షిప్ తో కాంస్య పతకాన్ని సాధించారన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ నుండి భారత దేశానికి ఏకైక పతకంగా మారిందని మరియు 2011లో ప్రారంభమైన దేశం యొక్క పతకాల పరంపర కొనసాగేలా చేసిందన్నారు పౌర సన్మాన గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ మాట్లాడుతూ థామస్ కప్ గెలవడంతో సంతోషంగా ఉంద న్నారు. తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో నేనుఈ స్థాయికి ఎదిగానని భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ద్వారా ఈ ప్రాంత పేరు ప్రఖ్యాతులను మరింతగా దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తానని అన్నారు .ఈ పౌర సన్మానాన్ని ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్ వారిని సాత్విక్ ఈ సందర్భంగా అభినందించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు క్రీడారంగం అభివృద్ధికి ఓఎన్జిసి ద్వారా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించినoదులకు సాత్విక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి మాట్లాడుతూ స్థానిక పట్టణానికి చెందిన సాత్విక్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా రాణించి ఈ ప్రాంత ఖ్యాతిని, పేరు ప్రఖ్యా తులను ఇనుమడింప చేశాడని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందని, పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రoకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలు విజయం సాధించి సంబరాలు చేసుకున్నారని, తొలి భారతీయ పురుషుల జోడీగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారన్నారు. బ్యాడ్మింటన్ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లో డి ఆర్ ఓ సత్తిబాబు,మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, మున్సిపల్ కమీషనర్ వి ఐ పి నాయుడు,ఆర్ డి ఓ వసంత రాయుడు,DTO ప్రతాప రావు,DSO సురేష్ కుమార్ సాత్విక్ తల్లిదండ్రులు శ్రీ కాశీ విశ్వనాథం శ్రీమతిరంగమణి, రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్మన్ కె. సత్య శైలజ, మెట్ల బాబు, తహసీల్దార్ పి శ్రీ పల్లవి, సాత్విక్ అభిమానులు ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడారంగంలో రాణిస్తూ ఈ ప్రాంత ఖ్యాతిని దేశ నలుమూలల ఇనుమడింప చేయాలి
addComments
Post a Comment